తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ వ్యవహారంలో ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం సరైందేనని పేర్కొంది. తనను ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తాజాగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు ఈడీ అధికారుల వద్ద ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించడం చట్టవిరుద్ధమేమీ కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తన అరెస్టును సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు ఈడీ అధికారుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందన్న ఢిల్లీ హైకోర్టు గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తి చెప్పారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ఆయనకు రిమాండ్ విధించడం చట్టప్రకారమే జరిగాయని వ్యాఖ్యానించింది.
అయితే కేజ్రీవాల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఉండదని పేర్కొంది. కేజ్రీవాల్ సీఎం అయినంత మాత్రాన ఆయనకు ప్రత్యేక హక్కులేమీ ఉండవని పేర్కొంది. విచారణ ఎలా సాగాలో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ చెప్పాల్సిన అవసరం లేదని నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంది.