భారతీయ జనతా పార్టీ(బిజెపి) లోక్ సభ ఎన్నికల్లో తొలి విజయం సాధించి ఖాతా తెరిచింది. గుజరాత్ లోని సూరత్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నామినేషన్ ల తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థిత్వం తిరస్కారానికి గురికావడంతో బిజెపి అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఏప్రిల్ 21న జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు స్పష్టం చేశారు.
పైగా, తాము సంతకాలు చేయలేదని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ ను సమర్పించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. చేతివ్రాత నిపుణిడితో ఆ సంతకాలు వారే చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆధారాలు సమ్పరించినా అఫిడవిట్, ఇతర ఆధారాల కారణంగా పరిగణలోకి తీసుకోలేదు.
ఆ వెంటనే ఈ స్థానం నుంచి నామినేషన్లు వేసిన బీఎస్పీ అభ్యర్హ్డితో సహా అభ్యర్థులంతా పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. ఈ నాటకీయ పరిణామాల నడుమ ముకేశ్ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో ముకేశ్ దలాల్ను అభినందిస్తూ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చేతికి మొదటి విజయ కమలాన్ని అందించినందుకు ఆయనను అభినందించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం, సూరత్ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాయి