మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శుక్రవారం కాంగ్రెస్ నేతల నాటకం రక్తి కట్టించింది. ఉదయం మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ సింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ నిరసనగా సిఎం హౌస్ దగ్గర ధర్నా చేపట్టారు.
భోపాల్-విదిషా సరిహద్దులో టెమ్ మరియు రాజ్‌గఢ్ జిల్లాలో వరుసగా సుతాలియా డ్యామ్ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం విషయంలో చౌహాన్‌ను కలవాలని సింగ్ అనుకున్నాడు. ఈ మూడు జిల్లాలు, గుణకు చెందిన సుమారు 1,500 కుటుంబాలు ప్రాజెక్టుల వల్ల నష్టపోవలసి ఉంది, నష్టపరిహారం సరిపోదని వారు నిరసిస్తున్నారు.
అయితే, ధర్నా సమయంలోనే, మరో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ రాష్ట్ర హ్యాంగర్‌లో చౌహాన్‌ను కలిశారు. ఇద్దరు నాయకులు దాదాపు అరగంట పాటు ఒకరినొకరు చర్చలు జరిపారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న కమల్‌నాథ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.
చౌహాన్ తనకు ( కమల్‌నాథ్ ) కలవడానికి సమయం ఇచ్చారని, అయితే దిగ్విజయ్ సింగ్‌తో సమావేశాన్ని తప్పించుకున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు, హ్యాంగర్‌లో కలిసే అవకాశం వచ్చినదని చెప్పారు. “నేను చింద్వారా నుండి వస్తున్న స్టేట్ హ్యాంగర్‌లో దిగాను, సీఎం దేవాస్‌కు వెళుతుండగా అక్కడ ఉన్నారు. మేము కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరిగింది” చెప్పారు.
సింగ్ ధర్నా గురించి చౌహాన్ తనతో చెప్పగా దిగ్విజయను కలవడానికి తాను (చౌహాన్) సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారని పేర్కొన్నారు. “కానీ నేను ఇక్కడికి (ధర్నా స్థలానికి) రాగా, దిగ్విజయ సింగ్ తనకు ఒకటిన్నర నెలలుగా సిఎంతో అపాయింట్మెంట్ కోరుతున్నానని చెప్పారు. ఈరోజు అపాయింట్మెంట్ఇచ్చి, చివరి క్షణంలో రద్దు చేశారు” అని కమల్‌నాథ్ తెలిపారు.
అయితే ఆయన కొద్దిసేపు ధర్నా స్థలం వద్ద కూర్చొని నిష్క్రమించారు. దిగ్విజయ దాదాపు మూడు గంటలపాటు ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమైన వారితో, రాజకీయ మద్దతుదారులతో అక్కడే ఉన్నారు. సిఎం టెలిఫోనిక్ అపాయింట్మెంట్లు అమలు కావడం లేదని, తనకు వ్రాతపూర్వక అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.
చివరకు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ఫోన్లో చర్చించి జనవరి 23న ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 2 గంటలకు ధర్నాను విరమించారు. ఏది ఏమైనప్పటికీ, చౌహాన్- కమల్‌నాథ్ సమావేశం, దిగ్విజయ్ ధర్నా వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.