చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సైనిక సహకార కూటమి క్వాడ్ పేరును స్క్వాడ్‌గా అమెరికా మార్పు చేసి తిరిగి ప్రారంభించింది. అయితే, చైనాను కట్టడి చేయాలన్న దాని లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆస్ట్రేలియా, జపాన్, ఫిలీప్పీన్స్, అమెరికా ఈ నాలుగు దేశాలు కొత్త కూటమి స్వ్వాడ్‌లో భాగస్వాములుగా ఉన్నాయి.
ఇవి గత నెల ప్రారంభంలో దక్షిణ చైనా సముద్రంలో సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. ఆస్ట్రేలియాకు చెందిన వారముంగా, జపాన్‌కు చెందిన అకెబోనో, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆంటోనియో లూనా, అమెరికాకు చెందిన మొబైల్ కంపెనీల నౌకలు కలసికట్టుగా పని చేస్తూ ఈ సముద్ర జలాల్లో తమ ఉమ్మడి నావికా సామర్ధ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్నయించినట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
దక్షిణ చైనా సముద్ర దీవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే హక్కును అంతర్జాతీయ చట్టం తమకు కల్పించిందని స్క్వాడ్ కూటమి పేర్కొంది. కొన్ని వారాల తరువాత అంటే ఏప్రిల్ 22, మే 8 మధ్య బాలికాటన్-2024 పేరుతో ఫిలిప్పీన్స్, అమెరికా, ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఓడలు ఫ్రెంచ్ నావికాదళాలతో కలసి విన్యాసాలు నిర్వహించాయి. వీటిలో 16వేల మందికిపైగా సైనికులు ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాల వెలుప ఉన్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో పాల్గొన్నారు. ఈ దేశాల నౌకాదళాలతోబాటు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ కూడా పాల్గొంది.