బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి కంగనా రనౌత్ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో ఎంపీగా తెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి.. ‘ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే మీరు సినిమాలకు దూరంగా ఉంటారా..?’ అని ప్రశ్నించారు. అందుకు అవుననే సమాధానం ఇచ్చారు.
‘బాలీవుడ్లో నేను విజయం సాధించా. నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు నావంతు సేవ చేసేందుకు కృషి చేస్తా. అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తా’ అని కంగనా చెప్పారు.
అయితే ఎంపీగా గెలిచినా సినీ ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్మాతల నుంచి తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని ఆమె తెలిపారు. ‘మీరొక ప్రతిభావంతమైన నటి. సినిమాలకు దూరంగా ఉండొద్దు’ అని చాలా మంది నిర్మాతలు, ప్రముఖ నటులు కోరుతున్నట్లు కంగనా రనౌత్ చెప్పారు.
అంతకుముందు మరో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా భిన్నంగా స్పందించారు. ఏమన్నారంటే.. ‘ఎన్నికల ముందు నేను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కారణంతో వెంటనే బాలీవుడ్‌ను విడిచిపెట్టలేను’ అని చెప్పారు.
కంగనా రనౌత్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీపడ్డారు. ఎన్నికల కారణంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ ’ వాయిదా పడింది. ఎన్నికల వేళ కంగనా బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమా కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది.