గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.
భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలను ఈ పోటీకి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, వంశీ రామరాజు తెలిపారు.
ఉత్తమ కథానికకు 116 అమెరికా డాలర్లు చొప్పున రెండు సమాన బహుమతులు, ఉత్తమ కవితకు అదే విధంగా 116 డాలర్ల చొప్పున రెండు సమాన బహుమతులు అందజేస్తారు. అదే విధంగా “మొట్టమొదటి రచన విభాగం”లో కూడా సరికొత్త రచయితలకు అదే విధంగా 116 డాలర్ల చొప్పున రెండేసి బహుమతులు అందజేస్తారు.
ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాలని, కధలు 15 పేజీల లోపు, కవితలు 5 పేజీల లోపు ఉండాలని తెలిపారు. విజేతల వివరాలను ఉగాది నాటికి ప్రకటిస్తారు. రచనలను మార్చ్ 15 లోగా sairacha@gmail.com, vangurifoundation@gmail.com చిరునామాలు పంపించాలి.