భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బాంబింగ్ డ్రోన్ ఇండియన్ ఆర్మీకి అందుబాటులోకి వచ్చింది. భారత సైన్యం మొత్తం 480 నాగాస్త్ర-1 డ్రోన్ల తయారీ కోసం నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ నాగాస్త్ర-1 ను సిద్ధం చేసి భారత సైన్యానికి అందజేసింది.
స్వదేశీ లాటరింగ్ మందుగుండు డ్రోన్ ‘నాగాస్త్ర-1’ ఇళ్లలోకి ప్రవేశించి కూడా శత్రువులపై దాడి చేయగలదు. శత్రువును చేరి ఈ డ్రోన్ పేలిపోతుంది. అందుకే దీన్ని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. అత్యవసర సేకరణ అధికారాల కింద భారత సైన్యం నాగ్‌పూర్‌లోని ‘సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ డ్రోన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది.
ఈ డ్రోన్ పనితీరును శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. సైనిక భాషలో ఈ నాగాస్త్ర డ్రోన్లను లాటరింగ్ మందుగుండు సామగ్రి అంటారు. నాగాస్త్ర-1ను భూమి నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. ఇది 1.5 కిలోల పేలుడు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది లక్ష్యాలను పర్యవేక్షించి దాడి చేయగలదు.
టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను, చొరబాటుదారులను, శత్రు శిక్షణా శిబిరాలను ఈ డ్రోన్ ద్వారా చేయవచ్చు. నాగాస్త్ర-1 సూసైడ్ డ్రోన్ కేటగిరీలోకి వస్తుంది. జీపీఎస్‌తో కూడిన ఈ డ్రోన్.. ఇచ్చిన లక్ష్యాన్ని రెండు మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది. ఈ డ్రోన్ బరువు తొమ్మిది కిలోలు. దీని మ్యాన్ ఇన్ లూప్ పరిధి 15 కిలోమీటర్లు.
రక్షణ రంగంలో ‘మేక్-ఇన్-ఇండియా’ కింద భారత సైన్యం 480 నాగాస్త్ర-1 డ్రోన్లను ఆర్డర్ చేసింది. ఈ సూసైడ్ డ్రోన్లు శత్రు లక్ష్యాలపై కచ్చితంగా దాడి చేయగలవు. ఈ 480 డ్రోన్ల కోసం భారత సైన్యం, సోలార్ ఇండస్ట్రీస్ మధ్య జరిగిన ఒప్పందం విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి డ్రోన్లను విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేంది. తొలిసారి స్వదేశీ కంపెనీ వీటిని తయారుచేసింది.