లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు.
భర్తృహరి మహతాబ్ ఒడిశాలోని కటక్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలువడం ఇది ఏడోసారి కావడం విశేషం. గతంలో ఆయన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆయన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ తనయుడు. మహతాబ్ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఎంపీ భర్తృహరి మహతాబ్ను ప్రోటెం స్పీకర్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు.
