ఐఏఎస్ కేడర్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా బిజిపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతికూలంగా స్పందిందిస్తున్నాయి. దానితో, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదాలకు దారితీస్తుంది.
ఐఏఎస్ క్యాడర్ నిబంధనలు, 1954లో సవరణలను బహిరంగంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ సవరణలను ఆమోదించవద్దని కోరుతూ ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు వ్రాసారు.
జనవరి 12న, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అన్ని రాష్ట్రాలకు పంపిన నోటీసులో ఐఏఎస్ కేడర్ అధికారుల డిప్యుటేషన్‌కు సంబంధించిన 1954 నాటి నిబంధనలతో 6వ నిబంధనకు ప్రతిపాదిస్తున్న సవరణపై వారి అభిప్రాయాలు కోరింది.
ఐఏఎస్ కేడర్ నియమావళిలో సవరణలు మూడు అఖిల భారత సర్వీస్ అధికారుల సెంట్రల్ డిప్యుటేషన్లో ఈ సవరణ కేంద్ర ప్రభుత్వంకు ఎక్కువ నియంత్రణకు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే సివిల్ సర్వెంట్లను కేంద్ర మంత్రిత్వ శాఖలకు డిప్యూట్ చేసే అధికారం కేంద్రంకు లభిస్తుంది.
ఐఏఎస్ క్యాడర్ నిబంధనల మార్పుపై వ్యతిరేకత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులకు కొత్త నిబంధనలను తీసుకురావద్దని పేర్కొంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
సిఎం విజయన్ ఒక ట్వీట్లో ఇలా వ్రాశారు: “అఖిల భారత సర్వీసెస్ డిప్యుటేషన్ నిబంధనలలో ప్రతిపాదిత సవరణలు కేంద్రంలోని అధికార పార్టీకి రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో ఐఏఎస్ అధికారులలో భయం, సంకోచాన్ని ప్రేరేపిస్తాయి. ఇది సహకార సమాఖ్యవాదాన్ని బలహీనపరుస్తుంది; నిర్వీర్యం కావింపవచ్చు.”
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఐఏఎస్ నియమ సవరణను వ్యతిరేకించారు. కేంద్రం ప్రతిపాదనలు దేశ సమాఖ్య రాజకీయాలు, రాష్ట్ర స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగించేలావున్నాయని ప్రధానికి రాసిన లేఖలో స్టాలిన్ ఆక్షేపించారు.
“ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు క్యాడర్ నిర్వహణ విధానాల కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట సీనియారిటీల వద్ద అధికారుల కొరతను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని కూడా నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
తాజాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణలు రాష్ట్రాల హక్కులనుహరించేలా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసహనం వ్యక్తం చేశారు. ఈ నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ వ్రాసారు.
ఈ సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇవి ఐఎఎస్, ఐపిఎస్,ఐఎఫ్ఎస్ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండు లేఖలు రాశారు. ”సవరించిన సవరణ ప్రతిపాదన మునుపటి కంటే చాలా క్రూరంగా ఉందని నేను భావిస్తున్నాను. వాస్తవానికి ఇది మన గొప్ప సమాఖ్య రాజకీయాల పునాదులకు విరుద్ధం” అని పేర్కొన్నారు.
”వారు ‘సహకార సమాఖ్య’ కంటే ‘ఏక పక్షవాదాన్ని’ ప్రోత్సహింస్తున్నారు. ప్రధాని మోదీ నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారని, ఈ దశలోనే ప్రతిపాదనను విరమించుకుండారని ఆశిస్తున్నాను” అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా ప్రధానికి లేఖలు రాశారు.
అయితే ఈ ఐఏఎస్ క్యాడర్ రూల్ సవరణను కేంద్రం సమర్థించింది. ఐఏఎస్ నిబంధనల మార్పు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే దానిపై జనవరి 21న సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వివరణ ఇస్తూ, రాష్ట్రంతో పాటు కేంద్రంతో కలిసి పనిచేయడం ఐఏఎస్ అధికారుల దృక్పథాన్ని విస్తృతం చేస్తుందని చెప్పారు.
ఈ విషయమై తలెత్తిన రాజకీయ వివాదంపై వ్యాఖ్యానిస్తూ, “భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మీకు చాలా విస్తృత దృక్పథాన్ని ఇస్తుంది. రాష్ట్రాలలో సేవ చేయడం, భారత ప్రభుత్వానికి (విభాగాలు/మంత్రిత్వ శాఖలు) తిరిగి రావడం (వారి) వ్యక్తిగత అభివృద్ధి కోసం అధికారులకు చాలా అవసరం. వారు రాష్ట్రాలలో, భారత ప్రభుత్వంలో తదుపరి కెరీర్లో కూడా మెరుగైన పనితీరు కనబరుస్తారు” అని తెలిపారు.