మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. ఆదివారం శ్రీలంకతో జరిగిన తుదిపోరులో హర్మన్‌సేన ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే 2 ఛేదించింది.
కెప్టెన్ చమరి ఆటపట్టు (61 పరుగులు), హర్షిత (69* పరుగులు) హాఫ్ సెంచరీలతో లంక విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 1 వికెట్ దక్కించుకుంది. 166 పరుగుల లక్ష్య ఛేదనలో లంక రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వినీశి (1) రనౌట్‌గా పెవిలియన్ చేరింది.
అయితే ఈ అవకాశాన్ని టీమ్ఇండియ అందిపుచ్చుకోలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన హర్షితతో, ఆటపట్టు జట్టును విజయం వైపు నడిపించింది. ఈ క్రమంలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామం నెలకొల్పారు. 94 పరుగుల వద్ద ఆటపట్టును దీప్తి శర్మ వెనక్కిపంపింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కవిష (30* పరుగులు) రాణించింది. హర్షితతో కలిసి మ్యాచ్‌ను ముగించింది చివరి మూడు ఓవర్లలో శ్రీలంక విజయానికి 25 పరుగులు కావాల్సిన దశలో భారత్ ఇంకా ఆశలతో ఉంది. ఎక్కడైనా మ్యాచ్ మలుపు తిరుగుతుందని ఫ్యాన్స్ భావించారు.
అయితే 18వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ సహా 17 పరుగులు వచ్చాయి. దీంతో టీమ్ఇండియా ఓటమి దాదాపు ఖరారైంది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 8 పరుగులు అవసరం అవ్వగా, మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది.
అంతకుంముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (60 పరుగులు; 47 బంతుల్లో 10 x4) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.
జెమీమా రోడ్రిగ్స్ (29 పరుగులు; 16 బంతుల్లో 3×4, 1×6), రిచా ఘోష్ (30 పరుగులు; 14 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. షఫాలీ వర్మ (16), ఉమా ఛెత్రి (9), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2, సచిని నిశంసల, చమరి ఆటపట్టు, ఉదేశిక ప్రబోధని ఒక్కో వికెట్ పడగొట్టారు.
కాగా, తాజా విజయంతో శ్రీలంక మహిళల జట్టు తొలిసారి ఆసియా కప్ ట్రోఫీని దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంప్ టీమ్ఇండియా ఈసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.