పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి దక్కలేదు. ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయన పారిస్‌లో గడపాల్సి ఉన్నది. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పంజాబీ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సీఎం భగవంత్‌మాన్ పారిస్ వెళ్లాలనుకున్నారు. అయితే ఆయన ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదని సీఎంవో ఆఫీసుకు సమాచారం ఇచ్చారు.
స్వంత ఖర్చులతో పారిస్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. హాకీ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. హాకీ జట్టులో పది మంది పంజాబీ ప్లేయర్లే ఉన్నారు. కీలకమైన మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో మన జట్టుకు అండగా ఉండాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఒంటరిగా విదేశీ ప్రయాణాలు చేస్తుంటారని సీఎం మాన్ పేర్కొన్నారు.
పారిస్‌కు వెళ్లిన భారత బృందంలో 19 మంది పంజాబీ ప్లేయర్లు ఉన్నట్లు సీఎం వెల్లడించారు. 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై మ్యాచ్ నెగ్గి హాకీ ఆటగాళ్లు చరిత్ర సృష్టించారని, జట్టులో పది మంది క్రీడాకారులు పంజాబీలే అని తెలిపారు. అయితే పారిస్ వెళ్లేందుకు చాలా ఆలస్యంగా దరఖాస్తు చేస్తున్నట్లు తమ ఆఫీసు వాళ్లు చెప్పారని సీఎం మాన్ వెల్లడించారు.
గతంలో అమెరికా వెళ్లేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వలేదని, అమెరికా వెళ్లేందుకు గోపాల్ రాయ్‌కి కూడా అనుమతి ఇవ్వలేదని మాన్ గుర్తు చేశారు. కోర్టుకు వెళ్తేనే పర్మిషన్ ఇస్తున్నారని, ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్లాలా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం భగవంత్ మాన్కు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదన్న అంశాన్ని కేంద్ర స్పష్టంగా చెప్పలేదు. అయితే మాన్కు జడ్ ప్లస్ సెక్యూర్టీ ఉందని, ఆయన సెక్యూర్టీ అంశంలో కేంద్ర సర్కారు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.