మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌లోభారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మంగళవారం జరిగిన సెమీస్‌లో వినేశ్ పొగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్ను మట్టికరిపించి పైనల్ మ్యాచుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తుంది.
రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కు ప్రవేశించింది.
కొద్దిగంటల్లో ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమవుతుండగా.. ఆమె ఉండాల్సిన బరువుకంటే 150 గ్రాములు ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. రాత్రి అంతా బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం బరువు పరీక్షించే సమయానికి ఆమె 50 కేజీలకు మించి బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది.
వినేష్ ఫోగట్ ప్రస్తుతం ఒలింపిక్ విలేజ్‌లోని క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు. బరువు తగ్గడం కోసం రాత్రి అంతా ఆమె కసరత్తు చేశారు. ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుపై అప్పీల్ చేయడానికి భారత ఒలింపిక్స్ కమిటీ వద్ద ఎలాంటి ఆధారాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె పోటీలో నుంచి తప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
వినేష్ ఫోగట్ బరువును తగ్గించడానికి ఆమె కోచ్, సహాయక సిబ్బంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. జుట్టు కత్తిరించడం, రక్తాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఫోగట్ ఒలింపిక్స్ ఫైనల్స్ ఆడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడిందన్న వార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో బాధకరంగా ఉన్నప్పటికీ మరిన్ని విజయాలకోసం ప్రయత్నం చేస్తుండాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పిటి ఉషతో ప్రధాని మాట్లాడారు.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నింబధనల ప్రకారం బరువు నిరూపించుకోవడంలో విఫలమైతే ఆ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణిని పోటీల నుంచి అనర్హులుగా ప్రకటిస్తారు. తాను ఏదైనా పతకం గెలిచినా అది అందించరు.
వినేశ్ ఫొగాట్ అనర్హత అంశంపై పార్లమెంట్లో చర్చకు విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో ఫొగాట్ అనర్హతపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ మధ్యాహ్నం లోక్‌సభలో ప్రకటన చేశారు. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ అనర్హతకు గురైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.
‘ఈ రోజు వినేశ్ ఫొగాట్ బరువు 50 కిలోల 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెజ్లర్ అనర్హతకు గురయ్యారు. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన తెలియజేసింది. ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష ప్రస్తుతం పారిస్‌లోనే ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐవోఏ అధ్యక్షురాలితో మాట్లాడారు. ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. వినేశ్ ఫొగాట్ సన్నద్ధత కోసం కేంద్రం అన్ని రకాల సాయాన్ని అందించింది’ అని మాండవీయ లోక్‌సభలో వెల్లడించారు.