దేశంలో కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్ లోకి వెళ్లింది. వైద్యులు సూచన ప్రకారం చికిత్స తీసుకుంటుంది.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల స్వల్ప లక్షణాలతో కరోనా పరీక్షులు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కాజోల్ తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కాజోల్ సూచించింది.
కాగా, గత రెండు రోజులు పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో దేశంలో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరగడం కలవరానికి గురి చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,34,281 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 893 మంది కరోనాతో మరణించారు. దంతో ఇప్పటివరకు వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,52,784 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522 కు చేరింది. ఇందులో 3,87,13,494 వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,65,70,60,692 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.