ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెడుతూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, డిజిటల్ రుపీతో పాటు డిజిటల్ భారత్ పై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.
హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యం అని మంత్రి తెలిపారు. అందుకే ఆ దిశగా కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
మొదటి దశలో గంగానది పరివాహక ప్రాంతాల్లోని 5 కిలోమీటర్లలోపు ఉన్న వ్యవసాయ భూముల రైతులతో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడతామన్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఈ విధాన్ని ఊతమిచ్చేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌లో మార్పు చేసి సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కోరారు.
ఆర్గానికి ఫార్మింగ్, మోడ్రన్-డే అగ్రికల్చర్లకు ప్రోత్సహకాలను తగ్గించాలని తెలిపారు. అప్పుడే సేంద్రియ వ్యవసాయం ఆచరణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆరోగ్యానికి రసాయనాలు వాడి పండిస్తున్న ఆహార పదార్థాలు ఎంతమాత్రం మంచివి కావని మంత్రి అభిప్రాయపడ్డారు.
కనుక కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయం ఈ సమయంలో చాలా అవసరం అన్నారు. ఇక సేంద్రియ వ్యవసాయం అనేది ప్రకృతి సిద్దమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం.
ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్నివిస్మరిస్తూ పూర్తిగా ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
చిరుధాన్యాల సంవత్సరంగా 2023
2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భారతదేశంలోని రైతులకు రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
పంట అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, క్రిమిసంహారక మందుల పిచికారీ కోసం కిసాన్ డ్రోన్లను వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.. 2.37 లక్షల కోట్ల రూపాయలను ఎంఎస్పిని నేరుగా రైతులకు చెల్లిస్తామని సీతారామన్ చెప్పారు.
100 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని, ఈ ఏడాది బడ్జెట్ రాబోయే 25 ఏళ్లలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెబుతూ స్వయం సమృద్ధి సాధించడంపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టిందని ఆమె పేర్కొన్నారు. ద్రవ్య స్థితిపై పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు
* వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్. డ్రోన్లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన. పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు.
* ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్ ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు. అంగన్వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ.
* తెలుగు రాష్ట్రాలలో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రీయ సాగు.
* అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు(ఏటీఎం సహా) అందుబాటులోకి. ఇకపై చిప్ ఆధారిత పాస్ పోర్టులు. కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0
* డిజిటల్ పేమెంట్, నెట్‌బ్యాంకింగ్ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
* 2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. 2023 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం.
* ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు.
* అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్ఎనర్జీ యాక్షన్ ప్లాన్. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు.