రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధినిఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు.
అలాగే ఆర్బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీని రూపొందిస్తామని, కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పన జరుగుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) డిడక్షన్ ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పిఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు.
ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్ లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు.
బడ్జెట్ ముఖ్యాంశాలు
పేదల బడ్జెట్ శ్వాశత పరిష్కార మరియు దీర్ఘకాలిక ప్రయోజనాల బడ్జెట్ గా రూపకల్పన చేసారు.
* వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు.
* నీలాంచల్ ఇస్పాత్నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటుపరం చేశాం.
* సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ప్రత్యామ్నాయ పన్ను
* ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు
* స్వయం సమృద్ధిలో భాగంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధత
* స్థానిక పరిశ్రమలకు నష్టం కలగకుండా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ
* మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ
* బయటపెట్టని ఆదాయం, సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలు
* సహకార సంస్థల పన్నుపై సర్ ఛార్జి 7% తగ్గింపు
* స్టార్టప్ లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు
* కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ కంపెనీలకు పన్ను రాయితీలు.
* రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
* రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
* ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా
* 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా
* 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు
* రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు
* ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్ ఉండగా.. వీటిని 200 కి పెంపు
* 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్
* 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్ బ్యాంక్స్)
* అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు. డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు
* ఇకపై డిజిటల్ పాస్‌పోర్టులు. చిప్ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు
* పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు
* ప్రధాని ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం
* అర్బన్ ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్ ఉపయోగిస్తాం
* పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్ ఏర్పాటు
* వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు
* దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం
* 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
* డిజిటల్ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం
*వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు
* పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం
*రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు
* ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్లైన్లోనే
*అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం
* 2025 నాటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పూర్తి
* పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్
*ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్ఈజెడ్లో సమూల మార్పులు
*ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
*రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ అమలు
* రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం
* డిఫెన్స్ బడ్జెట్లో 25 శాతం డిఫెన్స్ రీసెర్చ్ కోసం కేటాయింపులు
* పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
*ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు
* సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు
* 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్
* ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్
* వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్
*పీపీపీ మోడల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు
* ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
*నిధుల సమీకరణకు సావర్ గ్రీన్ బాండ్ల
* 2022–23లోనే అమల్లోకి డిజిటల్ కరెన్సీ
* డిజిటల్ కరెన్సీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ
*ఎలక్ట్రికల్ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
* త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం
* ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు
*పెట్రో డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం
*దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
*చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్ వన్‌ప్రొడక్ట్ పథకం అమలు
* 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు
*రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు* భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ
*వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు
*చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్
*వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి
*కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక