రాహుల్ గాంధీ ఈ రోజుల్లో ట్విట్టర్లో తన ఫాలోవర్లు తగ్గిపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ట్విట్టర్ తన ఫాలోవర్లను తగ్గిస్తోందని ఆయన అనుమానిస్తున్నారు. అయితే తన పార్టీ ఓట్ల శాతం భారీగా పడిపోవడంపై మాత్రం ఆయన ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు.
ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఆరోపణ చేస్తూ ట్విట్టర్ సీఈఓకు లేఖ రాశారు. అందులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తన పాపులారిటీని ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే నిజం ఏమిటంటే రాహుల్ గాంధీ నిజాయితీగా తన పాపులారిటీని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది సీనియర్ నేతల తనఅనుచరుల నిష్క్రమణ గురించి ఆందోళన చెందితే ఎక్కువ ఉపయోగం ఉండొచ్చేమే.
జూలై 2021 వరకు, ట్విట్టర్లో తనను అనుసరించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోందని రాహుల్ చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన్ను ఫాలో అవుతున్న కొత్త వారి సంఖ్య జీరో అయింది. కాగా అప్పటికే ఫాలో అవుతున్న వారు కూడా వెళ్లిపోయారు.
గతేడాది ఆగస్టులోనే 54,803 మంది ఫాలోవర్లను కోల్పోయారు. ఈ ట్రెండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కొనసాగింది. ఈ సమయంలో ట్విట్టర్లో ప్రధాని మోదీని ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షలకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లే దీని వెనుక అసలు కారణమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అయితే అది సాధ్యమేనా? ఎందుకంటే దీనిపై ట్విట్టర్ కూడా తన వివరణ ఇచ్చింది.
ట్విట్టర్ విధానం ప్రకారం, అభ్యంతరకరమైన పోస్ట్ కోసం ఏదైనా ఖాతాను సస్పెండ్ చేయవచ్చు. అది అనేక సందర్భాల్లో ఖాతాలను బ్లాక్ చేయగలదు. ధృవీకరణ కోసం ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని అప్డేట్ చేయడానికి కాల్ చేస్తుంది. ఇది కంపెనీ పాలసీలో భాగం. ఫాలోవర్స్ తగ్గడం వెనుక ఎలాంటి కుట్ర లేదని రాహుల్ గాంధీకి ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.
ఎప్పటికప్పుడు ఫేక్ అకౌంట్లను డిలీట్ చేస్తూనే ఉన్నామని ట్విట్టర్ తెలిపింది. రాహుల్ గాంధీ కొంతమంది నకిలీ అనుచరులను కూడా ఈ ప్రక్రియలో తొలగించారా? నకిలీ ఖాతాలను గుర్తించడానికి ట్విట్టర్ తన ఉద్యోగుల ద్వారా ప్రయత్నం చేయకుండా కృత్రిమ మేధస్సు సహాయంతో చేస్తుంది.కాబట్టి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చే ప్రశ్నే లేదు.
రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగింపుకు గురైన ఫాలోవర్లలో ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకపోవడం కూడా ఇక్కడ గమనించాలి. రాహుల్ గాంధీ ట్విట్టర్ హ్యాండిల్‌ను హ్యాండిల్ చేసిన టీమ్, కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌కి అలాంటి ఫాలోవర్స్ దొరకలేదు. అంటే, సమస్య ట్విటర్లో కాదు, రాహుల్ గాంధీ ఆలోచనా విధానంలో ఉందని భావించాల్సి వస్తుంది.
నిజానికి ట్విట్టర్లో ఫాలోవర్ల సంఖ్య కంటే తగ్గుతున్న ఓటర్ల సంఖ్యపై రాహుల్ గాంధీ ఆందోళన చెందాలి. కానీ రాహుల్ గాంధీ అలా చేయడం లేదు. బదులుగా, స్వీయ-విశ్లేషణకు బదులుగా కుంటి సాకులకోసం ప్రయత్నిస్తున్నట్లుంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తారు. ఓట్లు తగ్గితే ఈవీఎంలను ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్లో అదే జరిగి, వారి ప్రజాదరణ తగ్గడం ప్రారంభించినప్పుడు, వారు దానిని ట్విట్టర్లో ప్రభుత్వ ఒత్తిడిగా చూడటం ప్రారంభిస్తారు.
పార్టీ సహచరులు తనను ఎందుకు వదిలేస్తున్నారో రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోగలరా? 2014 నుండి సెప్టెంబర్ 2021 మధ్య 177 మంది మాజీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలతో సహా 222 మంది ప్రముఖ్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. అయితే, రాహుల్ గాంధీ ఈ విషయంలో ఆందోళన చెందడం మీరెప్పుడైనా గమనించారా?
రాహుల్ గాంధీకి తగ్గుతున్న ఫాలోవర్స్ గురించి ఆందోళన చెందుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ఓట్లు గురించి ఆందోళన చెందడం లేదు. 2009లో కాంగ్రెస్ పార్టీకి 28.55 శాతం ఓట్లు రాగా.. 2014లో ఈ ఓట్లు కేవలం 20 శాతానికి తగ్గాయి. 2019 లో కూడా అదే జరిగింది