భారత్‌లో మూడో వేవ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఇరవై నాలుగు గంటల్లో 83, 876 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
11,56,363 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 83 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాలు 895 చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులో 1,99, 054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జనవరి 6 తర్వాత లక్ష మార్క్‌కు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11, 08, 938 కాగా, రోజూవారీ పాజిటివిటీ శాతం 5, 02, 874గా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5, 02, 874 మంది (అధికార గణాంకాల ప్రకారం) చనిపోయారు. మొత్తం రికవరీల సంఖ్య 4,06,60,202గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా భారత్‌లో ఇప్పటిదాకా 1,69,63,80,755 డోసులు అందించింది.
కాగా, సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కార్యాలయాలకు పూర్తి హాజరు కావాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కార్యాలయాలు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్ హోం ఇక ముగిసినట్లేనని సింగ్ స్పష్టం చేశారు.
‘‘కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతున్నందు న కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు అన్నీ 100 శాతం అటెండెన్స్‌తో పనిచేస్తాయి. కరో నా పరిస్థితులపై రివ్యూ చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి చెప్పారు. ఉద్యోగులందరూ మాస్క్ పెట్టుకునేలా, కరోనా గైడ్‌లైన్స్ ఫాలో అయ్యేలా డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారు లు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒమిక్రాన్ విజృంభణ సమయంలో కార్యదర్శికన్నా కిందిస్థాయి కేంద్ర ఉద్యోగులకు కార్యదర్శి కంటే కిందిస్థాయిలో 50 శాతం ఉద్యోగులకు కేంద్రం ఇప్పటి వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పింది.