ఇటీవల హరిద్వార్‌లోని హర్కీ పైరీలో గంగమ్మను పూజించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడంలో బీజేపీ ఆయనకు `మంచి’ నేర్పిందని ఎద్దేవా చేశారు.
పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉత్తరకాశీలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి నడ్డా మాట్లాడుతూ, ఈ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు దేవాలయాలకు వెళ్లి గంగా, యమునా హారతి చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఓటర్లను హెచ్చరిస్తూ, రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు కల్పించేది కూడా ఇటువంటి కపటమని ధ్వజమెత్తారు.
అయితే అందులో మంచి విషయమేమిటంటే.. చివరకు మా దగ్గరే గుళ్లకు వెళ్లడం నేర్చుకున్నారని.. చివరకు మీరు భారతీయ సంస్కృతిని గుర్తు చేసి బీజేపీ నుంచి గుళ్లకు వెళ్లడం నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో బీజేపీ మాత్రమే అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేస్తూ అభివృద్ధిలో ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టబోమని నడ్డా భరోసా ఇచ్చారు.
బీజేపీ కాకుండా ఇతర పార్టీలు వస్తుంటాయి, ప్రలోభపెట్టి వాగ్దానాలు చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించి వెళ్తాయి.. తమ ఖజానా నింపుకుంటాయి, కుటుంబాలకు సేవ చేస్తాయేమో కానీ అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని ఆయన ప్రజలను వారించారు.
బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన నడ్డా, గంగోత్రి అయినా, యమునోత్రి అయినా, ఉత్తరప్రదేశ్ అయినా లేదా ఉత్తరాఖండ్ అయినా బీజేపీ అభ్యర్థుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని నేను మీకు నమ్మకంగా హామీ ఇస్తున్నాను అని చెప్పారు.
Trending
- రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ ఆపగలదు
- కంగనా చిత్రం `ఎమర్జెన్సీ’ కు పూర్తయిన సెన్సార్
- దేశంలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు
- ఇప్పటికే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చం.. హైడ్రా
- బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా మందలింపు!
- మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎంపీ షాక్
- మాజీ ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం ఝలక్
- ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న బోట్లు వైసిపి వారివే