కశ్మీర్ వేర్పాటువాదానికి సంఘీభావం తెలిపేలా పాకిస్థాన్ హ్యుందయ్ చేసిన ట్వీట్ పట్ల భారత్ లో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కంపెనీతో పాటు మరో మూడు కార్పొరేట్ కంపెనీల వ్యవహారం పట్ల కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ పోలీసులు ఒక న్యాయవాది ఫిర్యాదుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌కి చెందిన పాకిస్తాన్ ఆఫ్షూట్ కాశ్మీర్‌లోని ప్రజల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసిన కొద్ది రోజుల తర్వాత, ఈ ప్రజలు “స్వాతంత్య్రం కోసం పోరాటం” కొనసాగిస్తున్నందున మద్దతుగా నిలబడాలని ప్రజలను కోరింది,
దీనిపై భారత విదేశాంగశాఖ దక్షిణ కొరియా రాయబారిని పిలిపించి తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వెంటనే, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్ భారత విదేశాంగ మంత్రి మంత్రి ఎస్ జైశంకర్ కు ఫోన్ ద్వారా, తర్వాత సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజలకు, భారత ప్రభుత్వానికి జరిగిన “అపరాధానికి చింతిస్తున్నాను” అని తెలిపారు.
పాకిస్థాన్ హ్యుందయ్ ట్విటర్ ఖాతా చేసిన ట్వీట్ పట్ల చింతిస్తున్నామని దక్షిణ కొరియా ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి చుంగ్ యూయి-యాంగ్, భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వద్ద విచారాన్ని వ్యక్తం చేశారు.
విదేశీ పెట్టుబడులను భారత్ ఆహ్వానిస్తుందని.. అయితే, ఆయా దేశాల సంస్థలు భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని జైశంకర్ తేల్చిచెప్పారు. అటు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోనూ హ్యుందయ్ సంస్థను భారత రాయబారి వివరణ అడిగారు.
ప్రతి ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంస్మరణదినంగా పాక్ పాటిస్తుంది. ఈ క్రమంలో పాక్‌లోని హ్యుందయ్ డీలర్ ఒకరు కశ్మీర్ వేర్పాటువాదులకు సంఘీభావం తెలుపుతూ.. స్వాతంత్య్రం కోసం స్వేచ్ఛకోసం పోరాటం అంటూ అదే రోజున ట్వీట్ చేశాడు.
అది వైరల్‌గా మారడంతో భారత ప్రజలు హ్యుందయ్ సంస్థపై విరుచుకుపడ్డారు. వ్యాపారం చేసుకునే సంస్థకు రాజకీయాలతో సంబంధమేంటంటూ నిలదీశారు. దేశంలో ఆ సంస్థను నిషేధించాలంటూ హ్యాష్ ట్యాగ్‌నూ వైరల్ చేశారు.విమర్శల వెల్లువతో.. హ్యుందయ్ మంగళవారం ట్విటర్లో క్షమాపణలు తెలిపింది.
‘‘రాజకీయ లేదా మతపరమైన అంశాలకు దూరంగా ఉండటం మా సంస్థ విధానం. పాకిస్థాన్‌లో డీలర్ అనధికారికంగా కశ్మీర్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ ట్వీట్లను తొలగింపచేశాం. అతడు చేసిన పనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని సంస్థ తెలిపింది.
మరోవైపు పలువురు రాజకీయ నాయకులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. కాగా.. హ్యుందయ్ తరహాలోనే పాక్‌లోని పిజాహట్, కేఎఫ్‌సీ సంస్థలు కశ్మీర్ వేర్పాటువాదానికి మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశాయి. తర్వాత.. కేఎఫ్‌సీ భారత ప్రజలకు క్షమాపణలు తెలిపింది. తమ బ్రాండ్‌పై వచ్చే అనుచిత పోస్టులను అనుమతించేది లేదని పిజాహట్ స్పష్టం చేసింది.
దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్ నుండి తనకు కాల్ వచ్చిందని, “హ్యుందాయ్ విషయం” గురించి చర్చించానని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం అని పిలవబడే సోషల్ మీడియా పోస్ట్‌ను హ్యుందాయ్ పాకిస్తాన్ చేసినట్లు మేము చూశాము. ఫిబ్రవరి 6, 2022 ఆదివారం నాడు ఈ సోషల్ మీడియా పోస్ట్ చేసిన వెంటనే, సియోల్‌లోని మన రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి వివరణ కోరారు” అని తెలిపారు.
ఆక్షేపణీయమైన ఈ పోస్ట్ ను ఆ తర్వాత తీసివేశారని, రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో పిలిచి అసంతృప్తి వ్యక్తం చేసినదని కూడా చెప్పారు.
ఢిల్లీ పోలీసుల ఎఫ్ ఐ ఆర్
మరోవంక, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఆ నాలుగు కంపెనీలు కూడా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేశాయని, వాటి రిజిస్ట్రేషన్, వ్యాపారపరమైన లైసెన్సులను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోన్న నేపధ్యంలో యా, హ్యుండాయ్, పిజ్జాహట్, కేఎఫ్‌సీ కంపెనీలపై ఢిల్లీకి చెందిన వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే కార్పొరేట్ వ్యవహారాల విభాగంతో పాటు ఢిల్లీ పోలీసుల వద్ద ఈ నాలుగు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ చట్టంలోని 121 ఏ, 153, 153 ఏ, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
జమ్మూ కాశ్మీర్ అంశం అత్యంత సున్నితమైనదని, దీనిని వ్యాపారపరంగా మార్చుకోవడానికి ఈ కంపెనీలు యత్నించాయని వినీత్ జైన్ ఆరోపించారు. కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్న కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేయడంలో అర్థం లేదని స్పష్టం చేశారు.
హ్యుండాయ్, కియా, పిజ్జాహట్, కేఎఫ్‌సీ ఈ పోస్ట్ చేసిన తరువాత భారత్‌లో వాటిపై తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. ఈ నాలుగు కంపెనీలను బహిష్కరించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను హోరెత్తించారు.
ఈ క్రమంలో… ఆయా కంపెనీలు దిగొచ్చాయి. భారతీయులకు క్షమాపణలు చెప్పాయి. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన ఆకాంక్షలను తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నాయి. భారతీయులతో తమకు తమకు స్నేహ సంబంధాలు, ఉన్నాయని, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది తప్పే అవుతుందని స్పష్టం చేశాయి.
పాకిస్తాన్ విభాగం చేసిన ఆయా ట్వీట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ… దుమారం తగ్గలేదు. తాజాగా న్యాయవాది వినీత్ జైన్.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.