వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 30 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రికార్డు స్థాయిలో 11వ సిరీస్ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలోనే కేవలం 169 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టి ప్రతిభతో జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెట్టారు.
2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ఆఖరుసారి. మళ్లీ ఏడేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో ఒక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది.
విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల సరసన రోహిత్ శర్మ చేరారు.
ఇక వెస్టిండీస్‌ను టీమిండియా వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. ఇక స్వదేశంలో టీమిండియాకు ఇది 12వ వైట్‌వాష్ సిరీస్ కావడం విశేషం. టీమిండియా గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్‌లు వైట్‌వాష్ అయ్యాయి. ఈ జాబితాలో తాజాగా వెస్టిండీస్ చేరింది. తాజాగా టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన వెస్టిండీస్.. ఒక సిరీస్‌లో వైట్‌వాష్ కావడం ఇది 20వ సారి.
ఆదుకున్న అయ్యర్, పంత్
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
కొద్ది సేపటికే మరో ఓపెనర్ ధావన్ (10) కూడా వెనుదిరిగాడు. దీంతో భారత్ 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తమపై వేసుకున్నారు. ధాటిగా ఆడిన పంత్ ఆరు ఫోర్లు, సిక్స్ 56 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 9 ఫోర్లతో 80 పరుగులు సాధించాడు.
చివరల్లో దీపక్ చాహర్ (38), వాషింగ్టన్ సుందర్ (33) మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ 265 పరుగుల వద్దే ముగిసింది. ఇక అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కగా, యువ సంచలనం ప్రసిద్ధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
వన్డే చరిత్రలో ప్రసిధ్ కృష్ణ కొత్త రికార్డు
టీమిండియా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరపున మొదటి ఏడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు అతను ఆడిన ఏడు వన్డేలు కలిపి 18 వికెట్లు తీశాడు.
అంతకముందు అజిత్ అగార్కర్, బుమ్రాలు తొలి ఏడు వన్డేల్లో 16 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో 15 వికెట్లతో టీమిండియా మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో 14 వికెట్లతో నరేంద్ర హిర్వాణి, జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌లు సంయుక్తంగా ఉన్నారు.
అంతేకాదు సిరీస్‌లో బౌలింగ్‌లో విశేషంగా రాణించి మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం విశేషం.