ఉక్రెయిన్పై రష్యా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అమెరికా ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది.అక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది దేశం విడిచి రావాలంటూ విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇది వరకే తమ దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరుకోవాలని ఆదేశించిన అగ్రరాజ్యం సిబ్బంది విషయంలో మాత్రం వారి ఆలోచనకు వదిలివేసింది. కానీ ,తాజాగా వారినీ రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
కొంతమంది దౌత్యవేత్తలకు తమ మిత్ర దేశమైన పోలాండ్ సరిహద్దు సమీపంలోకి మార్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఇటీవల పోలాండ్కు దాదాపు 1700 మంది భధ్రతా సిబ్బందిని తరలించిన అమెరికా తాజాగా మరో మూడువేల మంది సైనికులకు పంపనున్నట్లు ప్రకటించింది.
నాటో బలగాలకు శిక్షణ అందించడమే వారి లక్ష్యమని, ఉక్రెయిన్లోకి ప్రవేశించడం కాదని తెలిపింది. ఉక్రెయిన్లోని అమెరికా పౌరులందరూ వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి రావాలని అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హ్చెరికలు జారీ చేసిన కొద్దిసేపటికే తాజా ప్రకటన వచ్చింది.
మరోవైపు జర్మనీలోని సుమారు వెయ్యిమంది అమెరికా సైనికులు.. నాటోకు మద్దతుగా రొమేనియాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా న్యూజిలాండ్ సైతం అమెరికా బాటపట్టింది. తమ దేశ వాసులు వెంటనే ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశ విదేశాంగ శాఖ శనివారం విజ్ఞప్తి చేసింది.