ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ నేరాలకు దూరంగా, శాంతి భద్రతల పరిరక్షణలో అద్భుతంగా పనిచేసినదని బీజేపీ ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తుంది. అఖిలేష్ యాదవ్ తిరిగి ముఖ్యమంత్రి అయితే `గూండాల పాలన’ తిరిగి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు.
వాస్తవాలు ఏవిధంగా ఉన్నప్పటికీ ఆదిత్యనాథ్ పాలన జర్నలిస్టుల పట్ల కాళరాత్రిగా మారినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారు వేధింపులకు, దాడులకు గురైనట్లు కూడా ఆరోపణలు చెలరేగుతున్నాయి.
తాజాగా, జర్నలిస్టులపై దాడికి వ్యతిరేకంగా కమిటీ (సిఎఎజె) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఐదేళ్లలో 12 మంది జర్నలిస్టులు హత్యలకు గురికాగా, 48 మంది జర్నలిస్టులు భౌతిక దాడులకు గురయ్యారు. 66 మందిపై వివిధ కేసులను నమోదు చేశారు.
ఐదేళ్లలో దాడులు, 138 దాడులు కేసులు నమోదు కాగా, ఆందోళనకరమైన అంశం ఏమిటన్తి, వాటిలో 75 శాతం కరోనా మహమ్మారి సమయంలో నమోదయినవే. ఈ దాడులలో అత్యధికంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, రాష్ట్ర రాజధాని లక్నో, పారిశ్రామిక నగరాలైన నోయిడా, ఘజియాబాద్ లలో ఉన్నట్లు
సిఎఎజె కన్వీనర్ అభిషేక్ శ్రీవాత్సవ్ తెలిపారు.
“ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా రెండు అంశాలు – శాంతిభద్రతలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తోంది. కానీ వైరుధ్యం చాలా స్పష్టంగా ఉంది. శాంతిభద్రతల విషయానికొస్తే, పాలకపక్షం అభివృద్ధి నమూనాగా చూపే నగరాలు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం నాల్గవ ఎస్టేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న, ‘శక్తిమంతులు’గా పరిగణించబడే జర్నలిస్టులు ఇందులో సురక్షితంగా లేరని స్పష్టం అవుతుంది. ఈ పాలనలో ఇక మారేవారు సురక్షితంగా ఉన్నారు? చెప్పాలి” అని ప్రశ్నించారు.
ఈ నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో కనీసం 55 మంది జర్నలిస్టులు, సంపాదకులు రాష్ట్రంలో అధ్వాన్నంగా మారుతున్న కరోనా పరిస్థితిపై కధనాలు వారాసినందుకు కేసులకు గురయ్యారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. కేవలం స్థానిక లేదా ప్రాంతీయ కరస్పాండెంట్లు మాత్రమే కాకుండా, ప్రముఖ జర్నలిస్టులను కూడా ఈ దాడులకు గురయ్యారు.
స్క్రోల్.ఇన్ వెబ్ పోర్టల్ ఎడిటర్ సుప్రియా శర్మపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఎస్సి/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 కింద వారణాసి జిల్లా యంత్రాంగం చర్య తీసుకున్నారు. ఆమె చేసిన ప్రధాన `నేరం’ ఏమిటంటే, 2018లో సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ప్రధాని నరేంద్ర మోదీ దత్తత తీసుకున్న గ్రామాలలో ఒకటైన దొమరిలో స్థానికుల పరిస్థితి లాక్డౌన్ సమయంలో ఎలా దిగజారిపోయిందో వివరించడమే.
ఈ నివేదిక ప్రకారం, వారణాసి అడ్మినిస్ట్రేషన్, నివేదిక ప్రకారం, వారణాసిలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమరి గ్రామానికి చెందిన మాలా దేవి అనే మహిళను ని లాక్ డౌన్ సమయంలో అత్యవసర ఆహారం లేకపోవడంతో గ్రామంలో పరిస్థితి క్షీణించిందని శర్మ తన కధనంలో పేర్కొనడం అబద్దమని ఫిర్యాదు చేయమని వత్తిడి చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నమోదు చేసిన బిబిసి, ది హిందూ వంటి ప్రధాన వార్తా సంస్థల రిపోర్టర్లు ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో కూడా లాక్ డౌన్ సమయంలో ఈ 73 పేజీల నివేదిక వెల్లడించింది.