గట్టి ప్రతిపక్షం లేకపోవడంతో తిరిగి సునాయనంగా అధికారంలోకి రాగలవని అంచనాలు వెనుకున్న గోవాలో బిజెపికి సొంతపార్టీకి చెందిన తిరుగుబాట్లే బెదడగా మారాయి. దానితో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
బీజేపీలో నాయకత్వం, అభ్యర్థులపై సర్వత్రా పార్టీ వర్గాలలోని ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారిక అభ్యర్థులుగా “ఇతర పార్టీల నుండి దిగుమతి చేసుకున్న నాయకులను” రంగంలోకి దింపడంతో “విశ్వసనీయులు”, “బయటి వ్యక్తుల” పోరుగా మారిపోయింది.
రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే మద్దతుదారుల నుండి ఎదురవుతున్న ప్రతిఘటన కారణంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తిరిగి ఎన్నిక కావడం కష్టం కావచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అదే విధంగా రాణే సహితం ముఖ్యమంత్రి మద్దతుదారుల నుండే ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య వైరం పార్టీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని బిజెపి మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన పనాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ రెబల్‌గా పోటీ చేస్తున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన బీజేపీ అభ్యర్థి అటానాసియో “బాబుష్” మాన్సెరేట్తో ఆయన పోటీ పడ్డారు.
ఉత్పల్ పారికర్ కు సీట్ ను పార్టీ తిరస్కరించడం రాష్ట్ర వ్యక్తంగా దివంగత ముఖ్యమంత్రి మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది.
బిజెపి మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కు కూడా పార్టీ టికెట్ నిరాకరించడంతో, మాండ్రెమ్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ మేనిఫెస్టో కమిటీకి అధిపతిగా ఉన్నప్పటికీ అభ్యర్థిత్వం పొందలేక పోయారు.
సంగెం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవేలార్ భార్య సావిత్రి కవేలార్ బీజేపీ రెబల్‌గా పోటీ చేస్తున్నారు. ఆ స్థానం నుంచి టికెట్ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. కుంభర్జువా నియోజక వర్గంలో బీజేపీ రెబల్ రోహన్ హర్మల్కర్ ఆ పార్టీ అభ్యర్థి జైనితా మద్కైకర్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
బీజేపీలో తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీకి కూడా లాభించింది. బిజెపి మాజీ మంత్రి మైఖేల్ లోబో విధేయతను మార్చుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి మరో నాలుగు ఇతర నియోజకవర్గాలపై లోబో గణనీయమైన ప్రభావాన్ని చూపగలరు. లోబో తనకు కంచుకోట అయిన కలంగుటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
అగ్ర నాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, బీజేపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయకుండా పార్టీ తిరుగుబాటుదారులను ఆపలేకపోయింది. అవి పనాజీ, మాండ్రేమ్, సాంగుమ్, కుంభర్జువా. పార్టీలోని అసమ్మతి కార్యకర్తలు ఎంజిపి అభ్యర్థులకు రహస్యంగా పనిచేస్తున్నారని తెలిసింది. ఎంజిపితో పొత్తు పెట్టుకున్న టిఎంసికి ఈ పరిణామం కొంతమేరకు ప్రయోజనం కల్గించే అవకాశం ఉంది.
మరోవైపు, పార్టీ నుండి శక్తివంతమైన నాయకులు పార్టీ ఫిరాయించడంతో గణనీయంగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజల నుండి చాలా సానుభూతిని పొందింది. అయితే, దాని 17 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పార్టీని విడిచిపెట్టడంతో, ఎన్నికల బరిలో ఉన్న కొత్త అభ్యర్థులు ఓటర్లకు తెలియదు. 40 మంది సభ్యులున్న శాసనసభలో 24 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారు.
గోవాలో పార్టీ తప్పుదారి పట్టించిన పార్టీ ఎన్నికల వ్యూహానికి “అసమర్థ” ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కంటే, బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ ధోండ్ కారణమని బిజెపి వర్గాలు ఆరోపిస్తున్నారు. మనోహర్ పారికర్ ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ధోండ్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. పారికర్ అనారోగ్యంతో ఉన్న సమయంలో గోవాకు తిరిగి వచ్చాడు.
పార్టీలో మరో బలమైన నాయకుడు లేకపోవడంతో పార్టీ మొత్తం ఆయన నియంత్రణలోకి వెళ్ళింది. అభ్యర్థులను ఎంపిక చేయడంలో, పార్టీ విధేయత, పరివార్ లింకులు, క్లీన్ రికార్డ్ వంటి అంశాలకు చెప్పుకోదగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించిన వారికి 25 శాతం టిక్కెట్లు కేటాయించారు.
ఫిరాయింపుదారుల పట్ల ప్రజల అసంతృప్తిని అంచనా వేయడంలో ఆయన విఫలమయ్యాడని ధోండ్ విమర్శకులు పేర్కొంటున్నారు. పాతకాలపు వారికి, పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కంటే వివాదాస్పద అటానాసియో మోన్సెరేట్‌కు పంజిమ్ టికెట్ కేటాయించాలనే విధ్వంసకర నిర్ణయంను తట్టుకోలేక పోతున్నారు. గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్, సంఘ్ పరివార్‌తో పాటు అనేక మంది ఉత్పల్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించడం గమనార్హం.