ఎపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించడం సరికాదని స్పష్టం చేశారు.
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మూడు రాజధానుల ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సమర్ధించడం లేదని తేల్చి చెప్పారు. విశాఖను రాజధానిగా చేస్తే సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం ప్రజలు ఎలా రాగలుగుతారని ఆయన ప్రశ్నించారు.
సాగునీటి రంగం, సమగ్రాభివఅద్ధి విషయంలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతోందని ఆయన ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా వెనుకబడి ఉందని, ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవని ఎత్తిచూపారు. కడప ఉక్కు కర్మాగారం ఎండమావిలా తయారైందని విచారం వ్యక్తం చేశారు.
ఐదు రకాల పండ్లను ఎగుమతి చేసేలా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. ఇంతటి అభివఅద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని మండిపడ్డారు.