ప్రముఖ సినీ నటి శృతి హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. తనతో కొన్ని రోజులుగా టచ్‌లో ఉన్నవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని మళ్లీ మీ ముందుకు వస్తానని ఆమె పేర్కొన్నారు.
తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తున్న శృతి హాసన్. తన తండ్రి కమల్ హాసన్ ఇమేజ్‌తో కాకుండా,నటనతో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 2000 సంవత్సరంలో తన తండ్రి సినిమా ‘హే రామ్’ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత హీరోయిన్ గా 2009లో ‘లక్’ మూవీ ద్వారా కనిపించారు. తెలుగులోకి 2011లో సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా ద్వారా అడుగుపెట్టారు. అనంతరం గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, క్రాక్ సినిమాలతో మెప్పించారు. ఆమె తన నటనతో ఇప్పటివరకు 13 అవార్డులు సొంతం చేసుకోగా.. 27 అవార్డులకు నామినేట్ అయ్యారు.
ఇలా ఉండగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 243మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,29,16,117కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో 5,13,724మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,11,472 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మరోవంక, కరోనా వ్యాక్సిన్ల విషయంలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దేశంలో 177.44 కోట్ల వ్యాక్సిన్లు పూర్తైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లోనే 24 లక్షలకు పైగా వ్యాక్సిన్లు పూర్తవడం విశేషం. మొత్తం రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్ డ్రైవ్‌లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.
నిన్న ఒక్క రోజే దాదాపు ఇరవై వేలకుపైగా కోవిడ్ పేషెంట్లు కోలుకున్నారని, ఇప్పటివరకు మొత్తం నాలుగు కోట్లమందికి పైగా పేషెంట్లు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్రం చెప్పింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. శనివారం రోజు దాదాపు 10,273 కరోనా కేసులు నమోదయ్యాయి.