తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆత్మకథను “ఉంగలిల్ ఒరువన్” (మీలో ఒకరు) పేరుతో సోమవారం చెన్నైలో విడుదల చేస్తూ, జమ్మూ కాశ్మీర్ “స్నాచింగ్” (లాక్కొంటుంది) చేస్తోందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒక రాష్ట్రంగా దాని అధికారాలను స్వాధీనం చేసుకొని, కేంద్ర పాలిత ప్రాంతంగా కుదించి, దానిని ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు చెందిన బ్యూరోక్రాట్లను పాలించేలా చేసిందని ఆయన ఆరోపించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం కేవలం పుస్తక ఆవిష్కరణ కోసమే అయినప్పటికీ బిజెపి వ్యతిరేక ప్రతిపక్షాల సదస్సుగా మారింది. అయితే బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులు మాత్రం గైర్హాజరయ్యారు. ప్రస్తుతం రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే రాలేకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
“నేడు విభజన వాదుల నుండి భారత దేశం తీవ్ర ప్రమాదాలను ఎదుర్కొంటున్నది. లౌకికవాదులందరు ఈ దేశపు మౌలిక విలువలు కాపాడాలి అనుకునేవారు అందరు కలసి రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని చెప్పడం ద్వారా దేశంలో బిజెపి వ్యతిరేక పార్టీలను సమీకరించడంలో కీలక పాత్ర వహించబోతున్నట్లు స్టాలిన్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
ఫెడరలిజంపై బిజెపి ప్రభుత్వ దాడుల ఇతివృత్తాన్ని కొనసాగిస్తూ, తమ ప్రభుత్వాల అనుమతి లేకుండానే సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) అధికారాలను రాష్ట్రాలలో పెంచిందని, దీని ఫలితంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో “వందలాది ఎకరాల” భూమిని కేంద్ర బలగాలు “తీసుకెళ్తున్నాయి” అని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీకి భారత రాష్ట్రాల చరిత్ర, మన వైవిధ్యం గురించి అవగాహన లేదని కాంగ్రెస్ నేత ఆరోపించారు. “ప్రజల గొంతులను వినడం, మన వైవిధ్యాన్ని గౌరవించే బదులు, వారు వివిధ రాష్ట్రాలపై తమ అజెండాలను విధిస్తున్నారు… ఈ రోజుల్లో మన ప్రజల గొంతులు వినబడవు, ప్రాతినిధ్యం వహించవు. బదులుగా, గొంతులపై దాడి చేస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
పైగా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం,మీడియా వంటి ప్రతి సంస్థపై క్రమపద్ధతిలో దాడి చేస్తున్నారని విమర్శించారు. కానీ బీజేపీ తమ భ్రమల్లో జీవించలేదని స్పష్టం చేస్తూ వారితో ఎలా పోరాడాలో తమకు తెలుసని రాహుల్ హెచ్చరించారు. “వారు మన చరిత్ర, సంప్రదాయంతో పోరాడుతారు. కాబట్టి మనం వారితో పోరాడతాము. వారు మమ్మల్ని ఓడించలేరు” అని భరోసా వ్యక్తం చేశారు.
డిఎంకె అధినేత స్టాలిన్ ఆత్మకథ విడుదలను “గ్రాండ్ ఈవెంట్” గా నిర్వహించారు. అందు కోసం ప్రముఖ అతిథులను చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చెన్నైకి తీసుకువచ్చారు. సమావేశంలో ప్రసంగిస్తూ, “జాతీయ పార్టీ సమావేశం లాగా నిర్వహించిన నా పెళ్లిలాగే ఇది (ఈవెంట్) కూడా (అలాగే నిర్వహించబడింది)…” అని స్టాలిన్ చెప్పిన్నట్లు అనిపించింది.
యాదవ్ తన ప్రసంగంలో, న్యాయవ్యవస్థ నియామకాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు బ్రాండ్ బిల్డింగ్, వ్యూహాలలో నిమగ్నమై ఉన్నప్పుడు, స్టాలిన్ వంటి ముఖ్యమంత్రి యువతకు తన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకాన్ని రాయడం, వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం సరికొత్త మార్గమని కొనియాడారు.
కేంద్రం తమ రాష్ట్ర అధికారాలను తీసివేసినప్పుడు తమిళనాడు అందించిన సంఘీభావాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తమ రాష్ట్ర ప్రజల సమ్మతి లేకుండా విభజించారని ఆరోపిస్తూ, దేశంలో మరే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “భారతదేశం అనే ఆలోచన” ను రక్షించడానికి ఒకేరకమైన భావాలు గల పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపిచ్చారు.
జమ్మూ కాశ్మీర్ కు ఏమి జరిగిందో రాబోయే రోజులలో కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పునరావృతం కావచ్చని ఆయన హెచ్చరించారు. రాహుల్ ఆవిష్కరించిన స్టాలిన్ ఆత్మకథను తమిళంలో వ్రాసారు. మూడు సంపుటిలలో రానున్న స్వీయచరిత్రలో ఇది మొదటిది. స్టాలిన్ జీవితంలోని మొదటి 23 సంవత్సరాలను, రాజకీయాలలో ఆయనన ప్రారంభ రోజులతో ఈ గ్రంధం వ్రాసారు.
ఈ సందర్భంగా నాయకులు తమ ప్రసంగాలలో స్టాలిన్ రాజకీయ ప్రయాణాన్ని కొనియాడారు. స్టాలిన్ రాజకీయ జీవితాన్ని వివరిస్తూ అతను “సంవత్సరాలుగా డిఎంకెలో కీలక పదవులను చేపట్టడానికి ముందు యువ నాయకుడిగా ప్రారంభించాడు” అని విజయన్ గుర్తు చేశారు.
చెన్నై మేయర్‌గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కావడానికి ముందు స్టాలిన్ తన రాజకీయ యాత్రను అట్టడుగు స్థాయి నుంచి ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడల్లా తమిళనాడు కౌంటర్ నిరసనల్లో ముందంజలో ఉండేవారని ఆయన ముందుండేవారని తెలిపారు.