ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల పాటు మోటర్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. యూకేలోని లండన్ నగరం నుంచి భారత్ కు బైక్ రైడ్ చేపట్టనున్నారు. ఒంటరిగానే ఆయన ఈ యాత్రను చేయనున్నారు.
శివరాత్రి రోజున ఈశా ఫౌండషన్ లో జరిగిన మహోత్సవంలో వాసుదేవ్ ఈ విషయాన్ని తెలిపారు. నేలతల్లి కోసం ఖండాంతర మోటారు సైకిల్ యాత్ర చేయున్నానని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయటానికే ఈ బైక్ యాత్ర అని చెప్పారు.
ఈ నెల 21న లండన్ నుంచి భారత్ వరకు 100 రోజుల పాటు బైక్ పై తాను ఒక్కడినే యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన ఈ మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా పర్యటించిన ప్రతి దేశంలో నేల భూసారాన్ని పరిరక్షించేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి పాలకులను కోరతామని సద్గురు తెలిపారు.
100 రోజుల యాత్రలో భాగంగా 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేయనున్నారు.