అమెరికా, ఐరోపా దేశాలను తమ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డిస్కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో రష్యా పోస్ట్ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో అమెరికా, ఐరోపాతో సహా పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. పలు అగ్రదేశాలు రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి.
అయితే, రష్యా మాత్రం తన దూకుడును తగ్గించలేదు. అంతటితో ఆగకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగింది. తాను అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగితే ఎదురయ్యే పరిణామాల గురించి రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ అమెరికాను ముందుగానే హెచ్చరించింది. ఈ మేరకు రష్యా తాను అంతరిక్ష కేంద్రం నుంచి డిస్కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియోను అనూహ్యంగా విడుదల చేసింది. 47 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో రష్యన్ వ్యోమగాములు రష్యన్ హాచ్ను లాక్ చేసి, ఫ్లయింగ్ అవుట్‌పోస్ట్ నుంచి దూరంగా జ్వెజ్డా మాడ్యూల్లో విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తోంది. మాడ్యూల్ స్టేషన్ నివాస గఅహాలకు ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.
యూఎస్ విభాగంలో జపనీస్, యూరోపియన్ ప్రయోగశాలలు ఉన్నాయి. జ్వెజ్డా మాడ్యూల్ మొత్తం అవుట్‌పోస్ట్‌కు స్పేస్ టగ్‌గా కూడా పనిచేస్తుంది. మాడ్యూల్‌లోని లైఫ్-సపోర్ట్ సిస్టమ్ యూఎస్ ల్యాబ్, డెస్టినీ లోపల ఉన్న సిస్టమ్‌తో కలిసి పని చేస్తుంది, ఇది మొత్తం అవుట్‌పోస్ట్‌లో కీలకమైన భాగం.
ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో అమెరికన్, రష్యన్, యూరోపియన్ సంతతికి చెందిన ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ఆ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా వైదొలగి ఆ 500 టన్నుల నిర్మాణాన్ని భారత్‌కి, చైనాకి వదిలేసే అవకాశం కూడా ఉంది. రష్యా ఇప్పటికే చైనా తరహాలో సొంత స్పేస్ స్టేషన్ కోసం ప్లాన్ చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో తన ప్లాన్ పూర్తిచేసే దిశగా దూసుకుపోతోంది.