ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ … యాపిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను, సర్వీసులను రష్యాలో పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ చర్యకు దీటుగా రష్యా తాజాగా ఓ కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టింది.
తమ దేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ‘అయ్య టీ 1 (AYYA T 1) ‘ ను తీసుకొస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లను స్కేల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన అనుబంధ సంస్థ స్మార్ట్ ఇకో సిస్టమ్ కంపెనీ అభివఅద్ధి చేస్తోందని తెలిపింది. ఐఫోన్లకు బదులు ‘అయ్య టీ1’ స్మార్ట్ఫోన్లను ఉపయోగించాలని తమ దేశ పౌరులను రష్యా కోరింది.
రష్యన్ స్టేట్ డూమా సభ్యులు మరియా బుటినా, డెనిస్ మైదానోవ్ లు మాట్లాడుతూ ఈ అయ్య టీ వన్ ఫోన్ అత్యంత నమ్మదగిన ఫోన్ అని తమ దేశ పౌరులకు సూచించారు. ‘అయ్య టీ1’ స్మార్ట్ఫోన్లలో యూజర్స్‌పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండటానికి కెమెరాలు, మైక్రోఫోన్‌ను టర్న్ ఆఫ్ చేసేలా ప్రత్యేక హార్డ్‌వేర్ బటన్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 15-19 వేల రూబెల్స్ ఉంటుందని తెలుస్తోంది.
అయ్య టీ వన్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. రెండు ప్రధాన కెమెరాలు 12 ఎంపీ, 5 ఎంపీ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.