నేతి మహేశ్వరరావు,అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్
నాయకుడు ఎప్పుడు ఇప్పటి అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఏమికావాలి? భవిష్యత్తు తరాలు ఎదుర్కోబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రణాళిక ఉండాలి. ఒక రాష్ట్ర బడ్జెట్ ప్రిపరేషన్ ముందు రాష్ట్ర సమస్యలేంటి రాష్ట్ర భవిష్యత్తు ఏమి చర్యలు తీసుకుంటే భవిష్యత్తు ఉంటుంది అన్నది ఆలోచించాల్సిన అంశం.
ఒక చిన్న కుటుంబం కూడా తమకు వచ్చే ఆదాయం రోజువారీ ఖర్చులు భవిష్యత్తు అవసరాల నిమిత్తం పెట్టే ఖర్చులు వంటి ప్రణాళిక వేసుకుంటుంది. ఒక చదువు లేని పాతతరం మన అమ్మ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆలోచించాలి? అంత ఆలోచించే బడ్జెట్ తయారు చేశారా?
రాష్ట్ర ఆదాయం 2022-23 కి అంచనా రూ 1,91,225 కోట్లు. అలాగే మూలధన వసూళ్లు రూ 65,031 కోట్లు అంటే. మొత్తంగా రాష్ట్ర బడ్జెట్ రెవిన్యూ లోటు రూ 17,036 కోట్లు. ఆర్థిక లోటు రూ 48,724 కోట్లు
ప్రాధాన్య రంగాలు నవరత్నాలు మొత్తం బడ్జెట్ లో ఉచిత పథకాలు తప్ప ఏమీ లేని ఒక టిష్యూ పేపర్ లాంటి బడ్జెట్. మొత్తం బడ్జెట్లో ప్రాధాన్య రంగాల అయిన సమస్యల్లో ఉన్న వ్యవసాయానికి కేటాయించిన నిధులు రూ 621 కోట్లు. అలాగే నిరుద్యోగ సమస్య తగ్గాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించిన నిధులు రూ 1,180 కోట్లు.
మొత్తం రాష్ట్ర బడ్జెట్లో నికరంగా అభివృద్ధికి సంబంధించి కేటాయించిన నిధులు రూ 1,801 కోట్లు. అంటే రూ 65 వేల కోట్లు అప్పు తెచ్చి, రూ 2,1340 కోట్లు వడ్డీ చెల్లించడానికి, మిగిలిన అప్పుల్లో రూ 48,724 వేల కోట్లలో అభివృద్ధికి, అది కూడా ఆదాయం సమకూర్చే అభివృద్ధికి ఖర్చు పెట్టింది రూ 1,801 కోట్లు. ఈ లెక్కన అప్పులు తీర్చే సంక్షేమ పథకాలు ఖర్చులు పెట్టె ఏ కుటుంబమైనా ఏ రాష్ట్రమైనా దివాలా తీయటానికి ఎంతో సమయం పట్టదు
రాష్ట్ర సమస్యలు ఏంటి అన్నది ఒక సారి చూస్తే రాష్ట్రం నుంచి వలసలు పోవడం వలసలు మూడు విధాలుగా ఉంది. మొదటిది యువత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల వలసలు పోతున్నారు. రెండవది రైతులు వ్యవసాయం లాభసాటి లేకపోవడం వల్ల పోతున్నారు. మూడవది వ్యవసాయం మీద ఆధారపడి లేదా వృత్తి పనులు చేసుకునే బహుజనులు కూడా వలస పోతున్నారు.
ఈ వలసలు పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, వ్యవసాయానికి ప్రాధాన్యత లేకపోవడం, రాజధాని లేకపోవడం. ఈ మూడు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మూడు కలిపి మొత్తం బడ్జెట్ లో పెట్టిన నిధులు అక్షరాల రూ 1,801 కోట్లు.
దీన్నిబట్టి రాబోయే ఉపద్రవాలను సమస్యలను రాష్ట్రానికి ఏమి కావాలో అర్థం చేసుకోకపోవడంలో చిత్తశుద్ధి లేదు. ఎలా గెలవాలి? ఎలా పెట్టాలి? ఎలా మాయం చేయాలి? అన్నా నిజంగానే బడ్జెట్ ఉంది అనుకోవాలి. ఆఖరిగా ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే ఒక చిల్లర కొట్టు సామాను తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తయారుచేసిన పొద్దులు వలే ఉంది. అంతకుమించి ఈ బడ్జెట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు.
బడ్జెట్ ముఖ్యాంశాలు
రాష్ట్ర ఆదాయం- రూ 1,91,225 కోట్ల; అప్పులు రూ 65,031 కోట్లు; మొత్తం బడ్జెట్ రూ 2,56,256 కోట్లు; రెవెన్యూ లోటు రూ 17,036 కోట్లు; ఆర్థిక లోటు రూ 48,724 కోట్లు.
వ్యవసాయ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు రూ 621 కోట్లు (గత సంవత్సరం ఖర్చు పెట్టింది రూ 434 కోట్లు); పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించిన నిధులు రూ 1,180 కోట్లు (గత సంవత్సరం ఖర్చు పెట్టింది రూ 434 కోట్లు); వడ్డీలు చెల్లించటానికి కేటాయించిన నిధులు రూ 21,340 కోట్లు. మిగతావన్నీ ఓటు గుంజడానికి తాత్కాలిక తాయిలాలు. రూ 65,031 కోట్లలో అభివృద్ధికి ఉపయోగించిన నిధులు అక్షరాల రూ 1,801 కోట్లు అంతే అంతకుమించి చెప్పడానికి ఏమీ లేని బడ్జెట్ ఇది.