సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’.
1990 దశకంలో యునైటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాన మంత్రి పదవి కాలంలో కశ్మీర్ లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ . అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తంగా 90 దశకంలో మన దేశంలోనే శరణార్ధులుగా మారిన కశ్మీర్ పండిత్స్ దీనగాథపై తెరకెక్కిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ .
ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవులపై దారుణ మారుణ కాండకు పాల్పడ్డరు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా అయ్యేలా చేసారు.
మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిట్లు కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ మరుణ కాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు సమాచారం. ముష్కర దాడుల కారణంగా కశ్మీర్ పండితులను వారి స్వస్థలాల నుంచి తరిమి కొడితే.. పుట్ట కొకరు.. చెట్టుకొకరు అవుతారు.
ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించారు.
అప్పట్లో కశ్మీర్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్లో 113 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.55 కోట్ల వసూళు చేసిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు
ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా.. విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇటీవలే హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి.
ముఖ్యంగా అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించి మెప్పించారు. మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన అత్యంత భయానకమైన దారుణ మారుణ కాండను వెండితెరపై ఆవిష్కరించడం అంటే అంత సులువు కాదు. ఈ సినిమాను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రికి ఈ సినిమాను ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
అంతేకాదు ఈ సినిమాను అడ్డుకోవడానికి కోర్టులో వాజ్యాలు కూడా వేశారు. ఇలా ఎన్నో ఆటు పోట్లను ఎదర్కొని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కదిలించేలా ఉందని చెబుతున్నారు.ఈ సినిమాలో నిజమైన కశ్మీర్ నుంచి వలస వచ్చిన నిజమైన పండిత్.. అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో నటించడం చెప్పుకోదగ్గ అంశం.