పాకిస్థాన్లోని మియాన్ చిన్నూ సమీపంలో ఈ నెల 9న భారత క్షిపణి పేలడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పొరపాటున పేలి ఉండకపోవచ్చని, భారత సేనలు ఉద్దేశ్యపూర్వకంగా కూడా పేల్చి ఉండకపోవచ్చని స్పష్టం అవుతున్నది. దానితో దీని వెనుక విద్రోహ చర్య ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి పాక్ భూభాగంలో పడిందని, దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని భారత్ ఇప్పటికే తెలియజేసింది. కానీ భారత సైన్యం ఈ దుర్ఘటనపై అత్యున్నత స్థాయిలో `కోర్ట్ అఫ్ ఎంక్వయిరీ’ జరిపిస్తూ ఉండడంపై విద్రోహ చర్య కావచ్చనే అనుమానాలే కారణమని పలువురు భావిస్తున్నారు.
రొటీన్ నిర్వహణ లో భాగంగా మార్చి నెల 9 వ తేదీన బ్రహ్మోస్ మిసైల్ సిస్టంని సిద్ధం చేసే యత్నంలో ఫైర్ అయిపొయిందని చెబుతున్నారు. అయితే ఇదేమీ చిన్న తప్పు కాదు. పంజాబ్ లోని సిర్సా పట్టణానికి దూరంగా మిసైల్ టెస్ట్ రేంజ్ ఉంది. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ బాటరీలని మోహరించింది భారత సైన్యం.
ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేదుకు మిషన్ చెక్ చేస్తారు. దానిలో భాగంగా చెక్ చేస్తుండగా మిసైల్ ఫైర్ అయినట్లు చెప్తున్నారు. కానీ ఇలా ఫైర్ అవడం పొరపాటు కాదు మరియు అలా అయ్యే అవకాశం లేనే లేదని నిపుణులు భావిస్తున్నారు. ఎవ్వరో కావాలనే చేసిన చర్య కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మిసైల్ బాటరీ సిస్టం గురుంచి బేసిక్ అవగాహన ఉన్న వాళ్లకి ఇలా పొరపాటుగా ఫైర్ అయ్యే అవకాశం ఉండదు అని తెలుస్తుంది. ఇది కేవలం విద్రోహ చర్యగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒక దేశ భూభాగం నుండి ఏదైనా గాల్లోకి లేచి అది పక్కన ఉన్న దేశ భూభాగంలోని గగనతలం లోకి ప్రవేశించింది అంటే దాన్ని యుద్ధంగానే భావిస్తుంది ఆ దేశం.
అయితే మన రక్షణ మంత్రిత్వ శాఖ దీని మీద వివరణ ఇస్తూ రొటీన్ చెక్ లో భాగంగా బ్రహ్మోస్ మిసైల్ మిస్ ఫైర్ అయ్యిందని, అది పాకిస్తాన్ భూ భాగంలోకి వెళ్లిందని దీని మీద విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. దీని మీద ఉన్నతస్థాయి కోర్ట్ విచారణ కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపింది. ఆ మేరకు ఉన్నతస్థాయి కోర్ట్ విచారణ కోసం ఆదేశించింది.
అంటే దీనర్ధం ఒకరు కాదు, ఇద్దరు కలిసి కావాలనే చేసినట్లు అర్ధమవుతున్నది. అయితే సదరు బ్రహోమ్స్ సిస్టం నిర్వహణ ఇంచార్జ్ ఆఫీసర్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కోర్ట్ మార్షల్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నివేదిక ఇస్తుంది. ఆ పక్రియ అంతా జరుగుతుంది.
దీనిపై పాకిస్థాన్ మిలటరీ కి చెందిన మేజర్ జెనెరల్ బాబర్ ఇఫ్తికార్ మాట్లాడుతూ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టం భారత సరిహద్దుల్లోని సిర్సా దగ్గర మిసైల్ గాల్లోకి లేచిన వెంటనే అప్రమత్తం అయ్యిందని, ఆ మిసైల్ ఫ్లైట్ పాత్ ని రికార్డ్ చేస్తూ వెళ్ళిందనీ మొదట అది భారత్ భూభాగంలోనే ఎగురుతూ హఠాత్తుగా అది తిరిగి తమ భూభాగం మీదకి రావడం గమనించామని తెలిపాడు.
బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ భూభాగాలోకి ప్రవేశించినప్పుడు అది భూమి మీద నుండి 12 కిలోమీటర్ల ఎత్తులో శబ్ద వేగానికి మూడు రెట్ల వేగంతో ప్రయాణించింది అని చెప్తూ చివరికి మిసైల్ 204 సెకన్లు పాక్ భూభాగం మీద ఎగిరి పాకిస్తాన్ లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని మియా చన్ను దగ్గర పంట పొలాల్లో పడిపోయింది అని ప్రకటించాడు.
మరీ అంత ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా వాస్తవానికి దగ్గరలోనే ఉన్నాయి పాక్ మిలటరీ జెనెరల్ చెప్పిన గణాంకాలు. పాక్ లోని భారత రాయబారిని పిలిచి తీవ్ర నిరసన తెలిపింది పాక్ ప్రభుత్వం. అయితే తిరిగి పాకిస్థాన్ ఎందుకు దాడి చేయలేదు ?
వాస్తవానికి, చాలా కాలం క్రితమే భారత్ పాక్ ల మధ్య మిసైల్ ప్రయోగానికి సంబంధించి ఒక ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఏదన్నా మిసైల్ ని పరీక్షించదలుచుకుంటే మూడు రోజుల ముందుగానే ఇరు దేశాలు ఒకరికి ఒకరు తెలియచేయాలి. దీనికోసం ఒక మెకానిజం ని ఏర్పాటు చేయాలి. పాక్ భారత్ లు రెండూ ఈ మికానిజం ని ఏర్పాటు చేసాయి కూడా.
పరీక్ష నిర్వహించే ప్రదేశం,సమయం కూడా ఇరుదేశాలు పరస్పరం తెలపాలి. పరీక్షించదలుచుకున్న మిసైల్ కి వార్ హెడ్ ఉందా లేదా అనే విషయం కూడా తెలియచేయాలి. ఈ ఒప్పందం ప్రకారం పరీక్ష సమయంలో ఒక వేళ మిసైల్ దారి తప్పి వేరే దేశ భూభాగం లోకి ప్రవేశిస్తే దాన్ని యుద్ధంగా ప్రకటించకూడదు.
అయితే మూడు రోజుల క్రితం బ్రహ్మోస్ మిస్ ఫైర్ అయినప్పుడు దానికి వార్ హెడ్ లేదు. కేవలం మిసైల్ మాత్రమె ప్రయోగించారు. కాబట్టి పెద్దగా భయపడాల్సింది లేదు. కానీ మూడు రోజుల ముందే తెలియచేయలేదు. కాబట్టి అది ఒప్పంద ఉల్లంఘన అవుతుంది.
మిసైల్ పరీక్ష నిర్వహించే ప్రదేశం ఇరు దేశాల సరిహద్దులకి కనీసం 70 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. సిర్సా పట్టణం పాకిస్తాన్ సరిహద్దు నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా, మానవ తప్పిదం అనేది అబద్ధం అని స్పష్టం అవుతుంది.
ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటన గమనార్హం. గతంలో అమెరికా కి చెందిన TOMHAWLK క్రూయిజ్ మిసైల్ అసలు పేలకుండానే మధ్యలోనే తక్కువ ఎత్తు నుండి టెక్నికల్ గ్లిచ్ వల్ల కూలిపోయింది. అయితే పాకిస్థాన్ ఏ మాత్రం లోపలి భాగాలు చెడిపోకుండా దొరికిన తోమ్హాక్ క్రూయిజ్ మిసైల్ ని తరువాత లాబొరేటరీ కి తీసుకెళ్ళి, దాని డిజైన్ ని కాపీ చేసి స్వంతంగా క్రూయిజ్ మిసైల్ ని తయారు చేసుకోగలిగింది.
ఇప్పుడు కూడా మన బ్రమ్హోస్ మిసైల్ కూడా పూర్తిగా ద్వంసం అవకుండా కేవలం ఇంధనం అయిపోవడం వలన కూలిపోయింది. ఎందుకంటే దానికి వార్ హెడ్ లేదు. ఒక వేళ వార్ హెడ్ ఉండి ఉంటె దానివల్ల మొత్తం మిసైల్ ధ్వంసం అయి ఉండేది. కానీ వార్ హెడ్ లేకపోవడం వలన అలా జరగలేదు.
ఇప్పుడు అదే బ్రహ్మోస్ ని అన్నీ కాకపోయినా ఎదో ఒక భాగం పాకిస్తాన్ కి క్లూ ఇచ్చినట్లయింది. అంటే ఇది కావాలని చేసిన ప్రయత్నంగా భావించవచ్చు.
వాస్తవాలు తెలుసుకోకుండా పాకిస్థాన్ వైమానిక వ్యవస్థ అప్రమత్తత గురించి తెలుసుకోవడం కోసం భారత్ ఉద్దేశపూర్వకంగా ప్రయోగించి ఉండవచ్చని కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. అందుకోసం రూ 16 కోట్ల విలువ చేసే బ్రహ్మోస్ మిసైల్ ని ప్రయోగించ వలసిన అవసరం లేదు. అందుకోసం రూ 5 లక్షలు విలువచేసే హై స్పీడ్ డ్రోన్ ని ప్రయోగిస్తే సరిపోతుంది.
మరోవంక, ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు రోజు ఈ సంఘటన జరగడంతో, ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగిందా? పనిలో పనిగా ఏవో కొన్ని స్పేర్ పార్ట్స్ బ్రహ్మోస్ కి సంబంధించి పాకిస్థాన్ కి అందించడానికా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
1 Comment
Whatever may be the reason, there should be a thorough investigation from our side.
Otherwise, either of the country may take this incident as a precedence resulting gross compromise of the interests of both the countries.