ఉక్రెయిన్ పై 20 రోజులుగా భీకర యుద్ధం చేస్తున్న రష్యా ఆ దేశ సైన్యం, స్థానిక ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా వెనుకడుగు వేయడం లేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధంచడంతో దేశం అనూహ్యమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నా బెదరడం లేదు. అయితే వనరుల కొరత కారణంగా త్వరలో యుద్ధం ఆపక తప్పదని సైనిక నిపుణులు భావిస్తున్నారు.
కీవ్లోరష్యా దళాలు పూర్తి పోరాట సామర్థ్యాన్ని మరో “10 నుండి 14” రోజులు మాత్రమే కొనసాగించగలవని సీనియర్ యుకె రక్షణ వర్గాలు భావిస్తుండగా, వారు తీవ్రమైన వనరుల కొరత ఎదుర్కొంటున్నారని అమెరికా సైనిక నిపుణులు పేర్కొంటున్నారు. రెండు వారాలయితే ఇప్పటికే తమ స్వాధీనంలోకి వచ్చిన ప్రాంతాలను కట్టడి చేసుకోవడానికే సంఖ్యా పరంగా రష్యా సైనికులకు కష్టం కాగలదని యుకె నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కీవ్‌లో మాస్కో “పరుగులో ఉంది”, రష్యన్ సైన్యం ఇప్పటికే తమ సామర్ధ్యాన్ని “గరిష్టం”గా ఉపయో గించినదని చెబుతూ ఆ తర్వాత “ఉక్రెయిన్ ప్రతిఘటన బలం రష్యా దాడి చేసే శక్తి కి మించిపోతుంది” అని యుకె రక్షణ వర్గాలు తెలిపాయి. రష్యా వద్ద సరిపడిన సైనికులు లేకపోవడంతో ఇప్పటికే ఉక్రెయిన్ అంతటా వారి పురోగతి ఆగిపోయిన్నట్లు భావిస్తున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తమ దేశ ప్రజలకు ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆశావాదాన్ని ప్రతిధ్వనించారు, తన సైన్యం ‘రష్యన్ దళాలపై వినాశకరమైన నష్టాలను’ కొనసాగిస్తున్నదని చెప్పారు.
“త్వరలో రష్యా కూలిపోయిన హెలికాప్టర్ల సంఖ్య వందల యూనిట్లకు చేరుకుంటుంది. వారు ఇప్పటికే 80 యుద్ధ విమానాలను కోల్పోయారు. వందలాది ట్యాంకులు, వేల ఇతర యూనిట్ల పరికరాలను కోల్పోయారు. చెచ్న్యాలో ఏళ్ల తరబడి చేసిన యుద్ధంలో కన్నా 19 రోజుల్లో, రష్యన్ సైన్యం ఉక్రెయిన్‌లో కంటే ఎక్కువ కోల్పోయింది,” అని వివరించారు.
రష్యన్లు త్వరలోనే వనరుల కొరత కారణంగా ఉక్రెయిన్ పై దాడిని ఆపే స్థితికి చేరుకుంటుందని అమెరికా సైన్యంకు చెందిన ఐరోపా మాజీ యూఎస్ కమాండిగ్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ వెల్లడించారు. అంతేగాదు రష్యా బలగాలకు వనరుల కొరత తీవ్రంగా ఏర్పడునుందని నిపుణులు కూడా చెబుతున్నారని చెప్పారు.
లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ మాట్లాడుతూ రష్యన్లు యావోరివ్లోని కర్ట్ వోల్కర్ శిక్షణా కేంద్రమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ రాయబారిని వెంబడించడమే కాక ఉక్రెయిన్‌కి పోలాండ్ నుంచి యుద్ధ సామాగ్రిని తరలించే సరిహద్దుల వద్ద రష్యన్లు గస్తీ కాసారని పేర్కొన్నారు.
అయితే నాటో భూభాగాలకు సమీపంలో జరిగిన దాడిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పైగా రష్యన్లు వనరుల కొరత కారణంగా దాడిని ఆపాల్సిన పరాకాష్టకు చేరుకున్నారని స్పష్టం చేశారు. రష్యాలో సుమారు 10 రోజుల్లో మానవ శక్తి, మందుగుండు సామాగ్రి కొరత ఏర్పడనుందని తెలిపారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు గానూ మాస్కోను శిక్షించేందుకు 27 దేశాల కూటమి కొత్త ఆంక్షలను ఆమోదించినట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అంతేగాక ఈయూ ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఫ్రాన్స్, కూటమి “మా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించి, ఉక్రెయిన్‌పై దురాక్రమణలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని, అలాగే రష్యన్ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలకు సంబంధించిన నాల్గవ ప్యాకేజీని ఆమోదించింది” అని తెలిపింది. మొత్తంగా ఈయూ నియంత్రణ చర్యలు ఇప్పుడు సుమారు 862 మంది వ్యక్తలకు, 53 సంస్థలకు వర్తిస్తాయి.