భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఇక దేశంలో మూడో వేవ్ దాదాపు ముగిసినట్లే అనుకొంటున్న సమయంలో ఇప్పుడు నాలుగో వేవ్ దశ జూన్ 22 నాటికి ప్రారంభం అవుతుందని తాజాగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నాలుగో వేవ్నా లుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు.
అయితే నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా నాలుగో వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై రాష్ట్రలు అప్రమత్తంగా ఉండాలని, అస్సలు నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని హెచ్చరిస్తున్నది. కాగా, మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఇప్పుడు నాలుగో వేవ్‌లో కరోనా ఎలా ఉంటుందనేది ఆందోళన వ్యక్తం అవుతుంది. రెండో వేవ్ నుంచి మూడో వేవ్ వరకు దాదాపు 6 నెలల గ్యాస్ తీసుకున్న కరోనా, ఈ సారి 4 నెలలకే రాబోతున్నట్లు భావిస్తున్నారు.
దేశంలో కరోనా వేవ్‌లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా మూడో వేవ్ విషయంలో కొద్ది రోజుల తేడాతో దాదాపు కచ్చితమైన అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు మాత్రమే. అయితే కరోనా నిబంధనలు పాటిస్తుంటే మూడో వేవ్‌లో కూడా కేసులు పెద్దగా నమోదు కావని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా కట్టడికి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించడం ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.