సుమారు ఐదు నెలల అనంతరం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకి 80 పైసలు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.82.
కాగా, డీజిల్ ధర రూ. 95గా ఉంది. కోల్‌కతా, చెన్నైలలో వరుసగా పెట్రోల్ ధర రూ. 105.51, రూ.102.16 కాగా, డీజిల్ ధరలు వరుసగా రూ. 90.62, రూ.92.19 గా ఉన్నాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలుగా ఉంది. ఎపిలో పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ రూ95.40పైసలకు చేరింది. విజయవాడలో పెట్రోల్ రూ.110.80, డీజిల్ రూ.96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.26కు చేరింది.
గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ నవంబర్ 2021 నుంచి ఇంధన ధరలు మారలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరుగుతాయని అంచనా వేశారు.
కాగా, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచింది. మంగళవారం నుండి ఈ ధరలు అమలు కానున్నాయి. ఢిల్లీ, ముంబైలలో ఎల్పిజి సిలిండర్ ధర రూ.949.50కు పెరిగింది. కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెరిగింది. తెలంగాణలో రూ.1,002, ఎపిలో రూ.1,008గా ఉంది.