సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో హాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ వేడుకలో మొత్తం 23 విభాగాల్లో అవార్డులు అందజేశారు.
ఉత్తమ చిత్రంగా ‘కోడా’, ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్ ( ది ఐస్ ఆఫ్ టామీ ఫే), ఉత్తమ దర్శకుడిగా జేన్ కాంపెయిన్ (ది పవర్ ఆఫ్ డాగ్) నిలిచి ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నారు. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీపడిన భారతీయ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’కు నిరాశే ఎదురైంది. ఈ అవార్డును ‘సమ్మర్ ఆఫ్ సోల్’ కైవసం చేసుకుంది.
రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు ఆతిధేయులుగా వ్యవహరించారు. ‘సిఒడిఎ’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా మూడు విభాగాల్లో నామినేట్ అయి మూడింటిలోనూ విజయం సాధించింది.
మిగిలిన ఆ రెండు..ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయ నటుడుకు లభించాయి. ఆస్కార్స్ పది నామినేషన్లలో ఆరు అవార్డులను గెలుచుకుంది ‘డూన్’. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులను ఆ చిత్రం గెలుచుకుంది.
ఇక 12 నామినేషన్లను సొంతం చేసుకున్న ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ కేవలం ఒకే ఒక అవార్డును గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడి అవార్డును జేన్ క్యాంపియన్ గెలుచుకున్నారు. విల్ స్మిత్ తన కెరీర్లోనే మొదటి ఆస్కార్ అవార్డును ‘కింగ్ రిచర్డ్’ చిత్రం నటనకు గెలుచుకున్నారు.
ఇక ‘ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్’ చిత్రానికిగాను జెస్సికా చస్టెయిన్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా ‘వైస్ట్ సైడ్ స్టోరీ’కి అరియానా డిబోస్ గెలుచుకున్నారు. ప్రత్యక్ష ప్రసారానికి ముందు ఎనిమిది విభాగాలు ఆస్కార్లను అందుకున్నాయి. అయినా వాటి విజయాలు టెలికాస్ట్‌లో చేర్చారు.
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ మేకప్ మరియు హెయిర్ స్టయిలింగ్, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ వంటి వాటికి సంబంధించిన అవార్డులు ప్రత్యక్ష ప్రసారం కాలేదు.
ఆస్కార్ అవార్డుల వివరాలు
ఉత్తమ చిత్రం : కోడా, ఉత్తమ దర్శకుడు : జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ డాగ్), ఉత్తమ నటుడు : విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఉత్తమ నటి : జెస్సికా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫే), ఉత్తమ సహాయ నటుడు : ట్రాయ్ కొట్సూర్ (కోడా), ఉత్తమ సహాయ నటి : అరియానా డిబోస్ (వెస్ట్‌సైడ్ స్టోరీ),ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : సియాన్ హెడర్ (కోడా), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : కెన్నెత్ బ్రానాగ్ (బెల్ ఫాస్ట్), ఉత్తమ కాస్య్టూమ్ డిజైన్ : జెన్నీ బేవన్ (క్రుయెల్లా), ఉత్తమ సినిమాటోగ్రఫీ : గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్).
ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం : డ్రైవ్ మై కార్ (జపాన్), ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : బిల్లీ ఎలిష్ (నో టైమ్ టూ డై), ఉత్తమ సౌండ్ : థియో గ్రీన్, హెమ్‌ఫిల్, మార్క్ మాంగినీ, రాన్ బార్ట్లెట్ (డ్యూన్), ఉత్తమ యానిమేటేడ్ ఫిచర్ ఫిల్మ్ : ఎన్కాంటో, ఉత్తమ యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్ : ది విండ్షీల్ వైపర్, ఉత్తమ డాక్యుమెంటరీ(ఫీచర్) : సమ్మర్ ఆఫ్ సోల్,ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) : ది క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్, ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) : ది లాంగ్ గుడ్‌బై, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : డ్యూన్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : డ్యూన్,ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : డ్యూన్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : డ్యూన్.