ప్రపంచ దేశాల ఐక్యవేదిక ఐక్యరాజ్య సమితిలో రష్యా భారీ షాక్ తగిలింది. మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. శాశ్వత సభ్యత్వం హోదా ఉన్న దేశం ఒకటి ఇలా ఒక ఉన్నత మండలి నుంచి సస్పెండ్‌కు గురికావడం ఇదే తొలిసారి.
ఉక్రెయిన్ బుచా పట్టణంలో మారణహోమం సృష్టించిందన్న నెపంతో రష్యాను మండలి నుంచి తొలగించాలంటూ అమెరికా గురువారం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను సమర్థించింది. బుచాలో నరమేధానికి తెగబడ్డ రష్యా.. యుద్ధ నేరాలతో ఇప్పటికే శాంతి స్థాపనకు విఘాతం కలిగించిందని.. అలాంటి దేశానికి మండలిలో కొనసాగే అర్హత లేదంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో వాదించింది అమెరికా.
ఈ పరిణామంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి తొలగించడాన్ని గొప్ప చర్యగా అభివర్ణించింది. రష్యాకు ఈ మండలిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదంటూ సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి వాదించారు.
‘‘మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న ఐక్యరాజ్య సమితి సంస్థల్లో యుద్ధ నేరస్థులకు స్థానం లేదు’’ అంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబెల ట్వీట్ చేశారు. న్యాయం వైపు నిలబడిన సభ్యదేశాలకు రుణపడి ఉంటామంటూ ఆయన పేర్కొన్నారు.
యూఎన్ హెచ్ఆర్సీ నుంచి బహిష్కరణ పట్ల రష్యా మండిపడుతోంది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది క్రెమ్లిన్. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఒంటరిగా మారిపోయిన రష్యా ప్రతినిధి.. ఓటింగ్ సమయంలోనూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
ఈ పరిణామంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి తొలగించడాన్ని గొప్ప చర్యగా అభివర్ణించింది. రష్యాకు ఈ మండలిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదంటూ సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి వాదించారు. ‘‘మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న UN సంస్థల్లో యుద్ధ నేరస్థులకు స్థానం లేదు’’ అంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబెల ట్వీట్ చేశారు. న్యాయం వైపు నిలబడిన సభ్యదేశాలకు రుణపడి ఉంటామంటూ పేర్కొన్నారాయన.
అయితే, ఈ బహిష్కరణ పట్ల రష్యా మండిపడుతోంది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది క్రెమ్లిన్. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఒంటరిగా మారిపోయిన రష్యా ప్రతినిధి ఓటింగ్ సమయంలోనూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు.
ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా, 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పెద్ద దేశం చైనా రష్యాకు అనుకూలంగా ఓటింగ్‌లో వ్యతిరేకతను కనబర్చింది. భారత్ కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు.
ఇదిలా ఉండగా.. ఈ మండలిలో మొత్తం 47 దేశాలు ఉండేవి. 2011లో తొలిసారిగా లిబియాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు(పి5+1) ఉన్నాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాతో పాటు అదనంగా జర్మనీ కూడా ఉంది. ఈ జాబితాలో ఉన్న రష్యాను ఐరాసలోని ఒక ఉన్నత మండలి నుంచి తొలగించడం ఇదే ప్రప్రథమం.
మానవ హక్కుల పట్ల గౌరవంతో కొనసాగుతున్న మండలిలో రష్యాకు కొనసాగే అర్హత లేదని, ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని బుచా, ఇర్పిన్, మారియుపోల్ ప్రాంతాల్లో.. అది కలిగించిన వినాశనం, ప్రపంచం చూసిన దురాగతాలు యుద్ధ నేరాలకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయని అమెరికా ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఉక్రెయిన్‌పై రష్యా తన దురాక్రమణ యుద్ధాన్ని తక్షణమే, బేషరతుగా విరమించుకోవాలని, ఐక్యరాజ్య సమితి చార్టర్లో పొందుపరచబడిన సూత్రాలను గౌరవించాలని ఈ తొలగింపు చర్య ద్వారా ప్రపంచం మరొక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లయ్యింది అంటూ అమెరికా తెలిపింది.