తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా వీరిద్దరిని కలసి గవర్నర్ పట్ల అమర్ధ్యకారంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, ప్రోటోకాల్ పాటించడం లేదని తెలపడంతో పాటు పరిపాలన వ్యవహారాలపై కూడా ఫిర్యాదు చేసిన్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పెచ్చుమీరుతుండడంపై వారికి వివరించారని చెబుతున్నారు. గత అదివారం రాడిసన్ బ్లూ పబ్ లో దొరొకిన డ్రగ్స్ గురించి గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న పలు అవినీతి ఆరోపణలపై కూడా ఆమె ఓ ప్రత్యేక నివేదిక ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. ఆమె ఫిర్యాదులపై కేంద్రం సీరియస్ అయిన్నట్లు స్పష్టం అవుతున్నది.
ముఖ్యంగా గవర్నర్ ను అవమానించడం తనను అవమానించినట్లు అమిత్ షా వ్యాఖ్యానించినట్లు వెలువడిన వార్తా కధనం తెలంగాణ ఉన్నతాధికారులతో కలకలం రేపుతున్నది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీల నుండి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరికి త్వరలో కేంద్ర హోమ్ శాఖ సంజాయిషీ నోటీసులు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసై పట్ల ప్రోటోకాల్ పాటించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న విషయం తెలిసిందే. యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించిన తర్వాత దర్శానానికి వెళ్లిన గవర్నర్ పర్యటనకు జిల్లా కలెక్టర్, ఎస్పీ కాదు కదా.. కనీసం ఆలయ ఈవో కూడా హాజరుకాని ఘటనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.
పరిస్థితి రోజు రోజుకూ శృతి మించుతుండంతో సహించలేకపోయిన గవర్నర్ తమిళి సై కేంద్రంకు స్వయంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను అవమానించారని,కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆమె ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోయినా, రిప్లైపైవారిచ్చేవారిచ్చిన సమాధానాలపై అసంత్రుప్తి వ్యక్తమైనా సంబంధిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారంపై మౌనంగా ఉంటూ వచ్చిన గవర్నర్ మొదటిసారిగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా పరుషపదజాలం ఉపయోగించడం గమనార్హం.
బడ్జెట్ సమావేశాలు జరిపే ఫైల్ పై తానో 15 రోజుల పాటు సంతకం చేయకుండా ఉంటె అప్పుడే ప్రభుత్వం రద్దయి ఉండేదని చెప్పడం ద్వారా తాను తలచుకొంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేయగలననే స్పష్టమైన హెచ్చరికను ఆమె కేసీఆర్ కు పంపినట్లయింది. పైగా ఇప్పుడు కేంద్రం భోరోసా సహితం ఆమెకు చేదోడుగా వెల్లడైనది.
గవర్నర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం, మేడారం జాతరలో గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, రాజ్ భవన్ ఉగాది సంబురాలకు సీఎం, మంత్రులు, ఇతర అధికార ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం. నాగర్ కర్నూల్ అడవిబిడ్డల కార్యక్రమానికి కూడా ప్రోటోకాల్ పాటించకపోవడం…ఇలా ప్రభుత్వం కావాలనే గవర్నర్ ను అవమానిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానంపై గవర్నర్ తమిళిసై. ఢిల్లీలో మీడియాతో ముచ్చడించిన సందర్భంగా బావోద్వేగానికి లోనయ్యారు. రాజ్ భవన్ లో తన తల్లి చనిపోతే సీఎం కనీసం చూడటానికి రాలేదని, పలకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రధాని, రాష్ట్రపతి పరామర్శించారని.. కానీ కేసీఆర్ మాత్రం తనతో మాట్లాడలేదని పేర్కొన్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు స్పెషల్ ఫ్లైట్ అడిగినా ఇవ్వలేదని, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని వాపోయారు. కేసీఆర్ ని తాను అన్నగా సంభోదిస్తానని.. అయినా అయినా ఇలా చేయడం సరికాదని ఆమె విచారం వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని ఆమె తెలిపారు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు.