స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 మాక్స్ విమానాలను నడుపుతున్న 90 మంది పైలట్లపై ఏవియేషన్ రెగ్యులేటరీ డిజిసిఎ నిషేధం విధించింది. వీరికి సరిగ్గా శిక్షణ ఇవ్వలేదని గుర్తించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
‘ప్రస్తుతానికి మేము ఈ పైలట్లను బోయింగ్ విమానాలు నడపకుండా నిరోధించాం. వీరంతా మరోసారి శిక్షణ పొంది విమానాలను నడపవచ్చు’ అని డిజిసిఎ చీఫ్ అరుణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. లోపానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
దీంతో పైలట్లు మ్యాక్స్ సిమ్యులేటర్‌పై సరైన పద్ధతిలో మరోసారి శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. 2019లో ఆడిస్ అబాబా సమీపంలో ఇధియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 బోయింగ్ విమానం కూలి, నలుగురు భారతీయులతో సహా 157 మంది మరణించారు. అనంతరం వీటిపై నిషేధం విధించింది.
అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ విమానంలో అవసరమైన సాఫ్ట్వేర్ దిద్దుబాట్లపై డిజిసిఎ సంతృప్తి చెందడంతో గత ఏడాది ఆగస్టులో విమానాలపై నిషేధం ఎత్తివేసింది.
కాగా, స్పైస్‌జెట్‌లో బోయింగ్ విమానం నడిపేందుకు శిక్షణ పొందిన 650 మంది పైలట్లు ఉన్నారు. వారిలో 90 మంది పైలట్లు శిక్షణ ప్రొఫైల్‌ను పరిశీలనను డిజిసిఎ సరిగ్గా శిక్షణ తీసుకోలేదని గ్రహించి, వీరు విమానాలు నడపకుండా నిషేధం విధించిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తిరిగి డిసిజిఎ వీరి శిక్షణ పట్ల సంతృప్తి చెందితే, తిరిగి వారు విమానాన్ని నడవపవచ్చునని పేర్కొన్నారు.