`ద కశ్మీర్ ఫైల్’ చిత్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నుండి దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సఫిస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు చేసిన దర్శకుడు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు.
తన తర్వాత చిత్రం `ద ఢిల్లీ ఫైల్స్’ అని వెల్లడించారు. ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్… ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంతో ఇంకే రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారో అని బాలీవుడ్ సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్నారట.
కశ్మీరీ పండిట్ల సమస్యలపై చిత్రం తీసిన వివేక్.. ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంలో ఇంకే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారోనన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం ద్వారా ఏం చెప్పనున్నారో చూడాలి.
మరి ఈసారి ఢిల్లీలో ఏ సంఘటనని ఆధారంగా చేసుకుంటాడో అని ఇప్పటికే పలువురు కలవరపడుతున్నారట. దాంతో ద కశ్మీర్ పైల్స్ చిత్రం ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించింది. దాదాపు అన్ని ముఖ్యమైన భారతీయ భాషలలో కూడా విధులకు సిద్ధమవుతున్నది.
సామజిక అంశాలపై సునిశిత పరిశీలనలతో చిత్రాలు తీసే ఆయన నేర్పరితనం మొదటి చిత్రం `ద తాష్కెంట్ ఫైల్స్’ తోనే వెల్లడైనది. మసాలా ఫార్ములాలు లేకుండా, మంచి అభిరుచిలతో చిత్రాలు తీసే దర్శకుడిగా మొదటి రెండు చిత్రాలతోనే పేరొందారు. [