దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక స్వయం ప్రకటిత దైవంగా చెప్పుకొనే వాని ఆశ్రమంలో మహిళలు లైంగిక వేధింపులు గురవుతూ ఉండడం, అక్కడ యువతులను నిర్బంధించి వారి కుటుంభ సభ్యులను కూడా కలుసుకోనీవడం లేదనే ఆరోపణలు పట్ల ఢిల్లీ హైకోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. వీరేంద్ర దేవ్ దీక్షిత్కుచెందిన ఆశ్రమంలో వెలుగుచూసిన దారుణాలపై విస్మయం వ్యక్తం చేసింది.
ఆ ఆశ్రమంలో 160 మందికి పైగా యువతులు అమానవీయ స్థితిలో జంతువుల మాదిరిగా దుర్భర జీవితం గడుపుతున్నారని వ్యక్తమైన ఆరోపణలపై విచారం వ్యక్తం చేసింది. ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం పేరుతో వీరేంద్ర దేవ్ దీక్షిత్‌కు చెందిన ఆ ఆశ్రమంలో వీరేంద్ర చేతుల్లో 100 మందికిపైగా యువతులు తీవ్ర లైంగిక వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
2018లో ఆశ్రమంలోని 40 మందికి పైగా యువతులను ఢిల్లీ పోలీసులు రక్షించారు. అప్పటి నుంచి వీరేంద్ర దేవ్ దీక్షిత్ పరారీలో ఉన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు తాజాగా ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సాంఘి, న్యాయమూర్తి జస్టిస్ చావ్లా ఎదుట విచారణకు వచ్చింది.
న్యూఢిల్లీలాంటి నగరంలో పట్టపగలు ఓ ఆశ్రమంలో ఇలాంటి పిచ్చి పనులు జరగడం ఏమిటి? దీక్షిత్ గైర్హాజరీలో ఆశ్రమాన్ని ఎవరు నడుపుతున్నారు? అని ప్రశ్నిస్తూ ఆశ్రమాన్ని అధీనంలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఆశ్రమంలో ఉన్న వారిని ఎక్కడికీ తరలించకుండా నిరోధించాలని స్పష్టం చేసింది.
ఇలా ఉండగా, ఆమె తల్లిదండ్రులు ఆరా తీయగా ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ ఆశ్రమంలో చేరినట్లు తెలుసుకున్నారు. ఆమెను కలిసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే తండ్రిని మాత్రమే ఆమెను కలవడానికి నిర్వాహకులు అనుమతిచ్చారు. ఇంటికి రావాలని ఆయన ఎంత నచ్చజెప్పినా సంతోష్ రూప వినిపించుకోలేదు.
‘ఈ క్రమంలో 2017లో ఒకసారి ఆమెను కలుసుకోడానికి రాంరెడ్డి వచ్చిన సమయంలో రాజస్థాన్‌కు చెందిన పలువురు అక్కడ గొడవ చేస్తుండటాన్ని ఆయన గమనించారు. మైనర్లయిన తమ కుమార్తెలను తీసుకొచ్చి ఆశ్రమంలో బందీ చేశారని ఢిల్లీ మహిళా కమిషన్‌ను, హైకోర్టును వారు ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ఆశ్రమాన్ని తనిఖీ చేసి మైనర్లను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
తనిఖీల్లో ఇంజక్షన్లు, కొన్ని రకాల మందులు దొరకడం కలకలం సృష్టించింది. దాంతో రాంరెడ్డి దంపతులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరేంద్ర దేవ్ దీక్షిత్‌కు చెందిన ఆధ్యాత్మిక విద్యాలయంలో ఉన్న దుంపల సంతోష్ రూపను కలుసుకునేందుకు ఆమె తల్లిదండ్రులకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
అమెరికాలో నానోటెక్నాలజీ విభాగంలో పీహెచ్డీ చేసిన తమ కూతురు సంతోష్ రూపను అక్రమంగా ఆశ్రమంలో బంధించారని తల్లిదండ్రులు మీనావతి, రాంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సాంఘి నేతృత్వంలో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
సంతోష్ రూపను కలుసుకోడానికి ఆమె తల్లిదండ్రులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. కాగా సంతోష్ రూప అనంతపూర్ జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్ పూర్తిచేశారు. నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తున్న ఆమె 2015లో అదృశ్యమయ్యారు.