మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరి, కీలకమైన పదవీ బాధ్యతలు చేబట్టపోతున్నారంటూ విశేషంగా హడావుడి చేసిన రాజకీయ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా తానే ఒక పార్టీని ప్రారంభిస్తున్నల్టు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం బిహార్ నుంచే ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ లో చేరుతారని తొలుత భావించినా.. భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చాలా కాలంగా తాను అర్థవంతమైన ప్రజాస్వామ్యంలో భాగస్వామిగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన విధానాల తయారీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని చెబుతూ ట్వీట్ చేశారు.
ఇప్పుడు రియల్ మాస్టర్ గా మారే సమయం వచ్చిందని పేర్కొంటూ అంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీతో వస్తున్నానని వెల్లడించాయిరు. బిహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నానని చెప్పడం ద్వారా ప్రస్తుతంకు తన పార్టీ ఆ రాష్ట్రం వరకు పరిమితం కాగలదనే సంకేతం ఇచ్చారు.
‘ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే తపనతో పదేళ్లుగా ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో సాయపడ్డాను. ఇప్పుడు జీవితమనే పేజీని తిరగేస్తుండగా.. రియల్ మాస్టర్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాను. ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించి… సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బీహార్ నుండి నా ప్రయాణం మొదలు కానుంది’ అని ట్వీట్ చేశారు.
ప్రశాంత్ రెండేళ్ల క్రితమే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేత్రుత్వంలోని జెడియులో చేరి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. జనతాదళ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్నారు. అందులో కొంతమేర విజయం సాధించినట్లుగా భావించారు.
అయితే ఆ తర్వాత నితీష్ కుమార్ తిరిగి బిజెపికి సన్నిహితం కావడంతో ఆ దూరం అయ్యారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తాను ఓ ప్రాంతీయ పార్టీని ప్రారంభించి, రాష్ట్రంలో అన్ని సీట్లకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికలు సమీపించేసరికి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించారు.
గత ఏడాది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ అధినాయకులతో పలు సమాలోచనలు జరిపారు. నిర్వహించే పదవి, బాధ్యతల విషయంలోనే స్పష్టమైన అవగాహన కుదరక ఆ ఆలోచనను విరమించుకున్నారు. గత నెలలో కూడా తిరిగి అదేవిధంగా జరిగింది.
ఇప్పటికే పీకే ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పశ్చిమ బెంగాల్ లో టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి, తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కు వ్యూహకర్తగా వ్యవహరించగా, వారు ఎన్నికలలో గెలుపొందడంతో ఆయనకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.