ఆధునిక సమాచార సదుపాయం కల్పించడం కోసం భారత రైల్వలు రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రయాణికులకు కల్పించే పక్రియ ప్రారంభించగా, అదెక్కువగా దుర్వినియోగం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ సదుపాయంతో దేశంలోని రైల్వేస్టేషన్లు పోర్న్ హబ్స్‌గా మారుతున్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అందించే ఫ్రీ వైఫై తో చాలామంది పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసుకొంటున్నట్లు గమనిస్తున్నారు.
సికింద్రాబాద్ వంటి అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇప్పుడు పోర్న్ హబ్‌గా మారిందని చెబుతున్నారు. దీనికి డేటా మొత్తం ఖాళీ కావడం ఒక కారణమైతే, ఎక్కువగా ఈ ప్రాంతంలో వీపీఎన్ సహాయంతో పోర్న్ సైట్స్ యాక్సెస్ కావడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా విజయవాడ, టెంపుల్ సిటీ అయిన తిరుపతి వంటి చోట్ల కూడా పోర్న్ ఎక్కువగా చూస్తున్నారని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రైల్వే స్టేషన్లలో అత్యవసర ఉపయోగానికి వాడాల్సిన ఫ్రీ వైఫైని ప్రయాణికులు పోర్న్ చూడ్డానికి ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. పోర్న్ డౌన్ లోడ్ లతో మొత్తం డేటా ఖాళీ అవుతూ ఉండడంతో అత్యవసర సమాచారంకు సంబంధించిన డేటా అందుబాటులోకి రాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే మరీ ఇదే పనిగా పోర్న్ చూస్తున్నట్టు తెలుస్తోంది. స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు 30 నిమిషాలపాటు హైస్పీడ్ డేటాని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే తిరుపతి, విజయవాడ రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులో ఉంది.
భారత దేశంలో పోర్న్ సైట్ లను నిషేధించినా కొన్ని వెబ్ సైట్ ల ద్వారా మాత్రం అందుబాటులో ఉంటున్నాయి. 35 శాతం పోర్న్ సైట్ లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించాయి. దీంతో వందల జీబీల డేటాను ప్రయాణికులు వాడేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అత్యవసర సమాచారమా కోసం వాడుదాం అనుకున్న వారికి మాత్రం డేటా లభించడం లేదు.
వీపీఎన్ సహాయంతో పలు నిషేధిత సైట్లను యాక్సెస్ చేస్తున్నట్టు నెట్వర్కింగ్ నిపుణులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా 1600 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని రైల్వలు కల్పించాయి. ఈ సదుపాయాన్ని 90 శాతం వరకు పోర్న్ సైట్లను చూడ్డానికే ప్రయాణికులు డేటా మొత్తం వాడేస్తున్నట్టు తెలుస్తోంది.