ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలతో కూడిన ప్రతిష్టాకరమైన జి20 కూటమి శిఖరాగ్ర సదస్సుకు మొదటిసారిగా భారత్ఆ వచ్చే ఏడాది తిధ్యమివ్వనుంది. భారత్ ను ఈ సదస్సును జమ్మూకాశ్మీర్ లో నిర్వహించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకట్టుకోనుంది.
ఈ సదస్సు సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ జూన్ 23న కేంద్ర పాలిత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్ముకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే కావడం విశేషం.
1999లో జి-20 సదస్సు ప్రారంభమైనప్పటి నుండి భారత్ సభ్య దేశంగా ఉన్నప్పటికీ భారత్ లో ఎప్పుడు ఈ సదస్సు జరగలేదు. 2014 నుండి ఈ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ తరుపున ప్రధానినరేంద్ర మోదీ పాల్గొంటూ వస్తున్నారు. జి 20 సభ్యదేశాల్లో ఉన్న ఓ దేశం ప్రతి ఏటా డిసెంబర్లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది.
ఈ క్రమంలో భారత్‌కు ఈ ఏడాది డిసెంబర్ 1న అధ్యక్షత బాధ్యతలు లభిస్తాయి. గత ఏడాది భారత్ షెర్పాగా కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పీయూప్ గోయల్ ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా 2023 నవంబర్ 30 వరకు కూటమికి సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను భారత్ నిర్వహిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
దీంతో వచ్చే ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగే 18వ జి-20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమలుకు వెసులుబాటు కల్పించడం కోసం సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.