సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్‌చుగ్ సవాల్ విసిరారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్ఎస్ను ఓడించడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారని వెల్లడించాయిరు. ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా, ఎన్నికల తేదీలు ప్రకటించాలని బీజేపీని సవాల్ చేయడం ఆయన చేతగానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
ఎన్నికల తేదీలు నిర్ణయించేది బీజేపీ కాదని, ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు పెట్టాలని కోరారు. పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కేసీఆర్ వణుకుతున్నారని, ఆ భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
సభలో లక్షలాది మంది మోదీ, మోదీ అని అరవడాన్ని కేసీఆర్ కుటుంబమంతా కూర్చుని టీవీలో లైవ్ చూసి భయపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ప్రజలు ఆ పార్టీని సాగనంపాలని నిర్ణయించుకున్నారని, మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
రాజకీయాలను పక్కనబెడితే, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విషయంలో కేసీఆర్ వాడిన భాష సరికాదని తరుణ్‌చుగ్ మండిపడ్డాయిరు. కేసీఆర్ చంద్రుని మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడని, అది ఆయన మీదనే పడుతుందని హితవు చెప్పారు. గతంలో సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో అనుమానాలు వ్యక్తం చేసి, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాను నిలువరించలేరని వ్యాఖ్యానించి దేశ ఆర్మీని అవమానిస్తున్నాడని ఆరోపించారు.
భారత్ మీద కేసీఆర్‌కు ఎందుకంత అక్కసో అర్థం కావడం లేదని చేశారు. భారత్ ను తక్కువ చేసి చూపడానికి బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, చైనా దేశాలను పొగుడుతున్నారని తరుణ్ ఛుగ్ విమర్శించారు. యుద్ధాల కారణంగా డాలర్ రేటు పెరిగిందని, అది తాత్కాలికమేనన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు చెప్పారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కేసీఆర్ అంటున్నారని, ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడగలడా అని ప్రశ్నించారు. అసలు ఎమర్జెన్సీ అంటే ఏందో, 1975లో పరిస్థితులు ఎలా ఉండేవో కేసీఆర్ తెలుసుకోవాలని పేర్కొన్నారు. మోదీ ఏ విషయంలో బలహీనుడో చెప్పాలని అంటూ ఎన్నికలకు వెళ్తే ఎవరు బలవంతులో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఆయనలా అవినీతి, కుటుంబ రాజకీయాలు చేయకపోవడం వల్ల కేసీఆర్‌కు మోడీ బలహీనంగా కనిపిస్తున్నాడేమోనని ఎద్దేవా చేశారు.
‘‘దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయంలో నేను కూడా ఏకీభవిస్తున్నా. అయితే అది అభివృద్ధిలో కాదు. పోక్సో కేసుల్లో తెలంగాణ నంబర్ వన్. దేశంలో పోక్సో కేసుల సగటు 28.9 శాతం ఉంటే, తెలంగాణలో 36.9 శాతం ఉంది. అప్పుల్లో కూడా తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు” అని తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు.
ఊకదంపుడు ఉపన్యాసాలు బంద్‌పెట్టి వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకునే విషయంపై కేసీఆర్ ఫోకస్ చేయాలని హితవు పలికారు.
కేసీఆర్ కు ఈటెల సవాల్
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. తెలంగాణ ప్రజలకు పట్టిన శని కేసీఆర్ అంటూ 2008లో కూడా కేసీఆర్ మతిభ్రమించి ప్రెస్మీట్లు పెట్టేవాడని గుర్తు చేశారు. హుజురాబాద్ ఫలితాల తర్వాత కూడా కేసీఆర్ వరుసగా రెండు ప్రెస్మీట్లు పెట్టారని ప్రస్తావించారు. కేసీఆర్‌ను మొన్న గెలిపించిన గజ్వేలు ప్రజలు. వచ్చే ఎన్నికల్లో ఓడించేది కూడా గజ్వేల్ ప్రజలేనని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సవాల్ చేయడం కాదని, ముందు అసెంబ్లీ రద్దు చేయాయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేస్తూ ఎన్నికల్లో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని వెల్లడించారు.
`కేసీఆర్ దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలి. ఎన్నికలకు మేము సిద్దంగా ఉన్నాం. ఇప్పటికే అమిత్ షా కూడా కేసీఆర్ అసెంబ్లీ ని రద్దు చేస్తే… సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.’ అని ఈటెల రాజేందర్ వెల్లడించారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్భంగా ఉన్నారని చెబుతూ కేసిఆర్ ను రాజకీయంగా బొంద పెట్టేది తానే అని ఈటల సవాల్ విసిరారు.