ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విధానాలు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే తాను కేంద్ర మంత్రి పదవిని, ఆ తర్వాత బీజేపీలో పదవిని కూడా కోల్పోయానని సీనియర్ బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి చెప్పుకొచ్చారు. అక్కడకు ఒకసారి పార్టీ అధ్యక్షునిగా అమిత్ షా జోక్యం చేసుకొని తన మంత్రి పదవి కాపాడారని తెలిపారు.
గురు పూర్ణిమతో (జులై 13) ప్రారంభించి, రక్షాబంధన్ (ఆగష్టు 11) వరకు ట్విట్టర్ ద్వారా తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలు క్లుప్తంగా తెలియ చేయడం ఆమె ప్రారంభించారు. గతంలో వివాదాలు సృష్టించిన పలు అంశాల గురించి ఆమె ప్రస్తావించారు. మొదటగా ఇచ్చిన 41 ట్వీట్ లలో ఈ ఆసక్తికరమైన అంశాలను ఉన్నాయి. `సంక్షిప్త ఆత్మకథ’ గా వీటిని పేర్కొన్నారు. తన ఆత్మకథను ప్రచురించడానికి ఇద్దరు పేరున్న ప్రచురణకర్తలు ముందుకు వచ్చినా తాను అంగీకరింపలేదని ఆమె చెప్పారు.
ఆదివారం రాత్రి చేసిన ట్వీట్ల పరంపరలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా – అప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు – తనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించకుండా (సెప్టెంబర్ 2017లో) ఎలా రక్షించారో మరియు వివాదాస్పద హర్యానా ఎమ్మెల్యే గోపాల్ కందాపై చేసిన ట్వీట్ గురించి భారతి వివరించారు. , భారతి అతని పేరు చెప్పనప్పటికీ, ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కోల్పోయింది.
మధ్యప్రదేశ్‌లో మద్యపాన నిషేధం కోరుతూ ప్రచారాన్ని చేపట్టిన భారతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీకు ఇటీవల ఓ లేఖను పంపారు. అన్ని బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏకరీతి ‘ప్రజల అనుకూల’ మద్యపాన విధానాన్ని అమలు చేయసేవిధంగా ఆదేశించాలని అందులో ఆమె కోరారు.
మంత్రి పదవి కాపాడిన అమిత్ షా
హిమాలయ, గంగా, ఇతర నదులపై విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో (జూన్ 2016లో) అఫిడవిట్ సమర్పించడానికి తన జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖను తాను అనుమతించడం గురించి అందులో తెలిపారు. ఈ విషయమై సెప్టెంబరు 2017లో ఆమె నుండి ఆ శాఖలను తొలిగించి, కేవలం తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిగా చేశారు.
క్యాబినెట్ కార్యదర్శి, ప్రధాన మంత్రి కార్యాలయంలను సంప్రదించి ఇంధనం, పర్యావరణం, జలవనరుల – మూడు మంత్రిత్వ శాఖలు కలసి ఈ అంశంపై ఏకాభిప్రాయంకు రాలేకపోయామని ఆమె చెప్పారు. ప్రతిపాదిత 72 పవర్ ప్రాజెక్టులు గంగా నది, హిమాలయాలు, మొత్తం దేశానికి పర్యావరణ ముప్పు అని నిపుణులు భావిస్తున్నారని భారతి తెలిపారు.
“నేను, నా అధికారులు ఎవరినీ సంప్రదించకుండా (సుప్రీం) కోర్టులో అఫిడవిట్లో సమర్పించాము. ఇంధనం, పర్యావరణ మంత్రిత్వ శాఖలు, ఉత్తరాఖండ్‌లోని త్రివేంద్ర రావత్ నేతృత్వంలోని (బిజెపి) ప్రభుత్వం ఈ అఫిడవిట్‌పై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత కోర్టు అఫిడవిట్‌ను తిరస్కరించింది. ఇది (అఫిడవిట్) ఇప్పటికీ కోర్టు ఆస్తి, బహుశా కేంద్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా కొత్త అఫిడవిట్ దాఖలు చేయలేకపోయింది,” అని వివరిస్తూ భారతి ట్వీట్ చేశారు.
ఆ తర్వాత ఆమె ఇలా తెలిపారు, “ఏకపక్షంగా వ్యవరించినందుకు ఆ సమయంలో నన్ను మంత్రివర్గం నుండి తొలగించవచ్చు. కానీ కనీసం శాశ్వతమైన గంగను రక్షించారు. గంగానది శాశ్వత ప్రవాహానికి అప్పటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా మద్దతుగా నిలిచారు. ఆయన జోక్యంతో నన్ను తొలగించలేదు. కానీ నా శాఖలు మార్చారు”. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తాను అమిత్ షా సూచనకు అనుగుణంగా పోటీ చేశానని ఆమె చెప్పారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి కోల్పోయిన వైనం
అక్టోబర్ 2019లో హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వివాదంలో భారతి తన పాత్రను వివరించారు. దాని కారణంగా తాను పార్టీ ఉపాధ్యక్ష పదవిని కోల్పోవలసి వచ్చినట్లు పేర్కొన్నారు. వివాదాస్పద హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా పేరును ఆమె తన ట్వీట్లలో ఎక్కడా పేర్కొనలేదు. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కందా మద్దతును బీజేపీ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ట్వీట్ చివరకు బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది.
‘హర్యానా ఘటన అందరికీ తెలిసిందే. జరగబోయేది (ప్రధాని నరేంద్ర) మోడీ జీ, (హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్) ఖట్టర్ జీ వంటి నిరాడంబర వ్యక్తుల జీవిత ప్రయాణం మురికి నీళ్ల నుండి గంగలోకి ప్రవహించడం లాంటిది. నేను జాతీయ ఉపాధ్యక్షురాలిని. పార్టీ క్రమశిక్షణ ప్రకారం నేను ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడిని కలిసి నా అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ఉండాల్సింది. కానీ సమయం సరిపోలేదు. నేను ఉత్తరకాశీ, గంగోత్రిలో ప్రయాణంలో ఉన్నాను. ఈ వ్యక్తి (కందా) చార్టర్డ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. అందుకని అందుబాటులో ఉన్న మార్గాన్ని తీసుకుంటూ ట్వీట్ చేసాను. అప్పుడు ‘మీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎలా అన్నారు?’ అంటూ మీడియా చర్చకు దిగడంతో పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. హర్యానాలో మా ప్రభుత్వం ఏర్పడింది, పార్టీ పరువు కూడా కాపాడబడింది,” అని భారతి నాటి సంఘటనను వివరించారు.
“అప్పుడు జరగాల్సింది జరిగింది. క్రమశిక్షణ రాహిత్యం ఉండేది. కాబట్టి కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించినప్పుడు (సెప్టెంబర్ 2020లో), నన్ను సభ్యురాలిగా మాత్రమే ఉంచారు. కానీ ఆఫీస్ బేరర్ గా కాదు. కానీ నాకు ఈ విషయమై ఎటువంటి విచారకరమైన భావాలు లేవు. నా నాయకుడు నరేంద్ర మోదీజీ, అది అలాగే ఉంటుంది. నాకు, మా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాజీ అంటే చాలా గౌరవం” అంటూ ఆ నాటి ఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు తాను మధ్యప్రదేశ్‌లో మద్యానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించానని చెబుతూ ఇది పార్టీ విధానాలకు అనుగుణంగా ఉందని ఆమె తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఒకే రకమైన మద్యం విధానాలను కలిగి ఉండాలని తన అభ్యర్థనగా పేర్కొన్నారు.