ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ మార్గరెట్ ఆల్వాను పోటీలో నిలుపుతున్నట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వెల్లడించాయిరు. మార్గరెట్ ఆల్వా.. గోవా, రాజస్థాన్, గుజరాత్ గవర్నర్‌గానూ పని చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు.
ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. శరద్ పవార్ నివాసంలో ఆదివారంనాడు 17 పార్టీల నేతలు సమావేశమై మార్గరెట్ ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ నిర్ణయానికి మద్దతు పలకడంతో ఆమెకు తమ్ 19 పార్టీలు మద్దతు పలుకుతున్నట్లయింది.
ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆమె ఓ ట్వీట్ లో తెలిపారు. ”భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని హుందాగా స్వీకరిస్తున్నారు. నాపై విశ్వాసం ఉంచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన విపక్ష నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను… జైహింద్” అని ఆ ట్వీట్లో మార్గరెట్ ఆల్వా తెలిపారు.
మార్గరెట్ ఆల్వా స్వస్థలం కర్నాటక. 1942 ఏప్రిల్ 14న మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఏప్రిల్ 1974లో మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు. గతంలో గోవా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు.
రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో మార్గరెట్ కేంద్రమంత్రిగా సేవలందించారు. మార్గరెట్ 1974-98 వరకు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.