నీట్ పరీక్షలో విద్యార్థినుల లోదుస్తులు విప్పించి, వాటిని పక్కన పడవేసిన తర్వాతనే పరీక్షా హాల్లోకి అనుమతించిన ఆదివారం కేరళలో జరిగిన ఘటన దేశంలో కలకలం సృష్టిస్తున్నది. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా ఆయుర్లోని మాత్రో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కేంద్రంలో చోటుచేసుకుంది.
ఈ విషయమై ఓ బాధిత యువతిని తన లోదుస్తులు తీసేస్తేనే నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని బలవంతం చేసినట్లు కోటరక్కరా డిప్యూటీ ఎస్పికి ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా బయోమెట్రిక్ ఏజెన్సీ సిబ్బంది నిర్వాకం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు.
కేవలం తన కుమార్తెనే కాకుండా మొత్తం విద్యార్థునులను ఆ విధంగా వేధించారని, ఎటువంటి కరోనా నిబంధనలు పాటించకుండా ఆ లో దుస్తువులను ఓ స్టోర్ గదిలో కుప్పగా పడవేశారని, దానితో 90 శాతం మంది విద్యార్దునులు ఎంతో మనోవేదనకు గురై, పరీక్షను సరిగ్గా వ్రాయలేక పోయారని ఆమె తండ్రి విమర్శించారు.
పరీక్ష పూర్తైన తర్వాత పెద్ద ఎత్తున లోదుస్తులను ఓ అట్టపెట్టెలో కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, నీట్ పరీక్షలో విద్యార్థిని లోదుస్తులు విప్పించిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాత్రోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజమాన్య వివరించింది. విద్యార్థులను బయోమెట్రిక్ తనికీలు చేపట్టి లోపలికి అనుమతించే బాధ్యత ఏజెన్సీలదేనని పేర్కొంది.
పరీక్ష హాలులోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారని పేర్కొంది.