శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో ఎంపికైంది. అలాగే నాట్యం సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ కొరియోగ్రఫర్ గా సంధ్యారాజు, బెస్ట్ మేకప్ ఆర్టిస్ గా టీవీ రాంబాబుకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘అల వైకుంఠపురం’ సినిమాకుగానూ తమన్ కు అవార్డు దక్కింది. 2020లో వచ్చిన కలర్ ఫోటో సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
కలర్ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డు లంభించడం చాలా సంతోషంగా ఉందని సినిమా హీరో సుహాస్ తెలిపారు. సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని, హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని చెప్పారు.
సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సూరయై పొట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా’ సినిమాకు అవార్డుల పంట పండింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
అదే సినిమాలో హీరోయిన్గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడు (జీవీ. ప్రకాష్ కుమార్), ఉత్తమ స్క్రీన్ప్లే (సుధా కొంగర, షాలిని ఉషాదేవి) అవార్డులను దక్కించుకున్నారు.
ఉత్తమ నటుడిగా అవార్డును ఇద్దరు పంచుకోనున్నారు. సూరారైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)లోనటనకు గానూ సూర్య, తానాజీలో నటనకు అజయ్ దేవగణ్లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి (సూరారైపోట్రు)ని అవార్డు వరించింది.
ఈ ఏడాది మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటరిగిలో 148 చిత్రాలు (20 భాషల్లో )స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్ దేవ్గణ్ (తానాజీ), ఉత్తమ నటి అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు), ఉత్తమ చిత్రం :సూరారై పోట్రు (సుధాకొంగర)..ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుం), ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం), ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్ (అయ్యప్పనుమ్ కోషియుం).