కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారంతో విచారణను ముగించారు. మొత్తం మూడు రోజులలో 12 గంటల పాటు ఆమెను విచారించారు. బుధవారం మధ్యాహ్నానికే ఆమె విచారణను ముగించారు.
నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించిన కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీని కూడా ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీని ఐదు రోజులపాటు సుమారు 50 గంటల మేరకు విచారించారు.
అయితే, ఏ ప్రశ్న అడిగినా దిగవంత కాంగ్రెస్ నేత మోతిలాల్ ఓరా అన్ని వ్యవహారాలు చూసువుకునేవారంటూ ఆయనపై సోనియా గాంధీ నెట్టివేసిన్నట్లు తెలుస్తున్నది. దానితో విచారణను అర్ధాంతరంగా ముగించినట్లు భావిస్తున్నారు. ఆయన గతంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా, కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. డిసెంబర్, 2020లో మృతి చెందారు.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారాలు సహితం ఆయనే చూస్తుందనేవారని ఆమె చెప్పడంతో విచారణ ముందుకు సాగలేని పరిష్టితులు ఎదురయ్యాయని చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారాల్లో ఆమె పాత్రపై అధికారులు ఆరాతీశారు.
ఆయా సంస్థల్లో రాహుల్ గాంధీ పాత్ర గురించి కూడా సోనియాను ప్రశ్నించారు. ఈడీకి గతంలో రాహుల్ ఇచ్చిన సమాచారంతో సోనియా స్టేట్మెంట్ను పోల్చి చూడనున్నట్టు ఈడీ అధికారి తెలిపారు. ఆమె సమాధానాలు ఎక్కువగా మోతిలాల్ ఓరాపై నెట్టివేసి విధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.